సినిమా రంగంలో ఓ చిత్ర విచిత్రం ఉంది. సినిమా హిట్టయితే దాని క్రెడిట్‌ని తమ ఖాతాలో వేసుకుని, ఫ్లాపయితే మాత్రం దానిని ఇతరుల మీదకు నెట్టే మనస్తత్వాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ విషయంలో నిర్మాత, కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్‌రాజు మాత్రం సినిమా సక్సెస్‌ని నేను ఎంజాయ్ చేసినప్పుడు.. సినిమా ఫ్లాప్ అయితే నేనే దానికి బాధ్యత వహిస్తాను. అంతేగానీ ఇతరుల మీదకి నెట్టను. ఆ చిత్రాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో విశ్లేషించుకుంటాను. ఇక నాది ప్రొడ్యూసర్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా డబుల్‌రోల్. మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి 22 ఏళ్లు అవుతోంది. కానీ ఈ ఏడాది నాకు డిస్ట్రిబ్యూటర్‌గా చాలా బ్యాడ్ ఇయర్ అని చెప్పాలి. ఇక కొన్ని కారణాల వల్ల శంకర్, కమల్‌హాసన్‌లతో చేయాలని భావించిన 'భారతీయుడు 2' చిత్రం నుంచి తప్పుకున్నాను.
పవన్‌తో చేయాలని నాకు కూడా ఉంది. కానీ మంచి కథ, టైం కుదరాలి. సాయిపల్లవి 'శ్రీనివాసకళ్యాణం' చిత్రంలో తన పాత్ర నచ్చక దానికి నిరాకరించిందని, ఆమె సెట్స్‌కి టైమ్‌కి రాదనే వార్తలు నా చెవుల్లో కూడా పడ్డాయి. కానీ సాయిపల్లవి ఎంతో ప్రొఫెషనల్. ఆమె సరిగ్గా షూటింగ్‌కి వస్తుంది. ఎంతో బిజీగా ఉండి కూడా 'ఎంసీఏ' చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేసింది. మా బేనర్‌లో ఆమె మరో చిత్రం చేయనుంది. ఆమెకి అసలు 'శ్రీనివాస కళ్యాణం' స్టోరీనే తెలియదు. ఇక నా కెరీర్‌లో నో యాక్టింగ్.. నో డైరెక్షన్. ఇక ఒకే తేదీన రెండు చిత్రాలు విడుదల కావడం మంచిది కాదు. కానీ మరో ఆల్టర్‌నేటివ్ డేట్ దొరకనప్పుడు, లాంగ్ వీకెండ్, పండగల సమయంలో మాత్రం అది కొన్నిసార్లు తప్పదు.
ఇక సినిమాకి డిజిటల్ రైట్స్ అమ్మడానికి ఓ టైంని సెట్ చేయాలనే నిర్ణయం మంచిదే. కానీ సినిమా విడుదలైన రోజే పైరసీ వస్తోంది. అలాంటప్పుడు ప్రేక్షకులు పైరసీని చూడకుండా డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో టిక్కెట్లను కొని చూడటంలో తప్పులేదు. నా దృష్టిలో పైరసీ కంటే ఇది బెటర్. ఇక అందరు కలిసి పోరాడితేనే పైరసీని అరికట్టగలం. ఇక మన చిత్రాల అసలు కలెక్షన్ల స్టామినా అనేది వారం తర్వాత గానీ తెలియదు. బాలీవుడ్‌లో లాగా మనం కూడా గ్రాస్ కలెక్షన్లు చెప్పాలి. అంతేగానీ హైర్‌లు, షేర్ గ్యారంటీలు కలుపుకుని ఫస్ట్‌డే కలక్షన్స్‌ని చెప్పకూడదు. ఈ విషయంలో ఫిల్మ్‌మేకర్స్ మారాల్సివుందని చెప్పుకొచ్చాడు.