Advertisement
Google Ads BL

నా సినిమా హిట్టవ్వాలి.. అఖిల్ ది హిట్టవ్వాలి!!


కేవలం ఒక 24 గంటల తేడాలో రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో నాని ఎంసీఏ, అఖిల్ హలో సినిమాలు. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఈ రెండు సినిమాల నిర్మాతలు అయిన దిల్ రాజు, నాగార్జున మధ్య చిన్నచిన్న అభిప్రాయ బేధాలు వచ్చిన మాట కూడా వాస్తవం. నాగార్జున, దిల్ రాజు వారిద్దరూ ఎవరికీ వారే ఏ మాత్రం తగ్గకుండా తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.  అయితే ఇప్పుడు దీనిపై నాని మరోలా రియాక్ట్ అయ్యాడు.

Advertisement
CJ Advs

నాని వెర్షన్ ఎలా వుంది అంటే... అంతా అనుకుంటున్నట్టు నాకు, అఖిల్ కు మధ్య పోటీ లేదు. నాకు తెలిసి రెండు సినిమాలూ హిట్ అవుతాయి. ఇదే విషయంపై నేను అఖిల్ ఛాట్ కూడా చేసుకున్నాం. అంతేకాకూండా ప్రేమగా మెసేజ్ లు కూడా పెట్టుకున్నాం. మేమిద్దరం బాగానే ఉన్నాం. కొందరు మాత్రం లేనిపోని పోటీ సృష్టించారు అంటూ ఎంసీఏ, హలో సినిమాల మధ్య పోటీపై నాని వెర్షన్ ఇది. అలాగే హలో సినిమా ట్రయిలర్ చూసిన వెంటనే అఖిల్ కు ఫోన్ చేసి మెచ్చుకున్నానని.... ఎంసీఏ ట్రయిలర్ కూడా బాగుందంటూ విక్రమ్ కుమార్, అఖిల్ తనకు కాల్స్ చేశారని నాని చెప్పుకొచ్చాడు.

అయితే తనకో సిల్లీ ఆలోచన వచ్చిందని... అదేమిటంటే తమ మధ్య జరిగిన ఛాటింగ్ ను పబ్లిక్ లో పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఒక దశలో తనకు వచ్చిందంటున్నాడు నాని. మరి నాని ముందే డిసైడ్ అయ్యాడు. తన ఎంసీఏ, అఖిల్ రెండు హిట్ అవుతాయని.... అందుకే తాను మాత్రం పోటీ నుండి తప్పుకోలేదని చెప్పకనే చెప్పాడు.

Nani Stand on MCA and Hello:

Nani and Akhil Bond Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs