సినిమా ప్రపంచం అనేది ఓ కలల లోకం.. ఇందులోకి ప్రవేశించిన వారికి ఇది ఓ పద్మవ్యూహమే. అందులోంచి బయట పడటం ఎవ్వరికీ వీలుకాదు. ప్రవేశించే మార్గం ఉంటుందే గానీ నిష్క్రమించే మార్గం కనిపించదు. ఇక సినిమా ఫీల్డ్‌లోని గ్లామర్, ప్రముఖులతో పరిచయాలు, విలాసాలు, జల్సాల మోజులో అందులోనే ఉండిపోతారేమో గానీ అందులో సక్సెస్ కాలేకపోతే తమకు తెలిసిన మరో పని చేయడానికి మాత్రం ససేమిరా ఒప్పుకోరు. అన్నింటికి ఇష్టపడి నిర్మాత, దర్శకులు, హీరోల కోర్కెలను తీర్చే వారికి కూడా ఇందులో కొదువ లేదు. కానీ అదేమిటని ప్రశ్నిస్తే తమకు కాస్టింగ్ కౌచ్ ఎదురైందని, తమను పలువురు దర్శకనిర్మాతలు, హీరోలు 'అలాంటి' విషయాలలో సర్దుకుపొమ్మన్నారని చెబుతారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఓ ఆడదాని అంగీకారం లేకుండా కాస్టింగ్‌కౌచ్ జరిగే అవకాశమే లేదనేది పచ్చినిజం.
ఇక ఈ మధ్య మన నటీమణులు పలువురు వ్యభిచారం కేసుల్లో ఇరుక్కున్నవారు ఉన్నారు. వ్యాంప్‌జ్యోతి, యమున, సుకన్య, భువనేశ్వరి నుంచి శ్వేతాబసు ప్రసాద్ వరకు ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వర్ధమాన హీరోయిన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఆమె పేరు రిచా సక్సేనా. ఈమె ఆదిత్య అనే వ్యక్తి హీరోగా ఆదిత్య ప్రొడక్షన్స్ బేనర్‌లో రూపొందిన భాస్కర్ బంటుమల్లి దర్శకత్వంలో వచ్చిన 'జూన్ 1:43' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆన్‌లైన్ ఫ్రాడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు. దాంతో ఆమెకి అసలు అవకాశాలే కరువయ్యాయి. దాంతో ఆమె వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంది.
ఇక ఈ హోటల్‌లో ఆమెతో పాటు కాస్టూమ్స్ డిజైనర్ మౌనికా కడాకియా కూడా పోలీసులకు దొరికింది. ఇక వీరికి సహకరించిన హోటల్ మేనేజర్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి నిందుతుల నుంచి 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారి వల్ల మొత్తం సినిమావారి పరువు పోయే ప్రమాదం ఉందని చెప్పవచ్చు.