Advertisement
Google Ads BL

ప్రగ్యాజైస్వాల్‌.. ఇదో రకం పబ్లిసిటీ!


సోషల్‌ మీడియాను సామాన్యులు ఎంత వరకు ఉపయోగించుకుంటున్నారో తెలియదు గానీ సెలబ్రిటీలు మాత్రం తాము తమ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండటానికి, తమదైన ఫొటో షూట్స్‌తో ప్రేక్షకుల, దర్శక నిర్మాతల దృష్టిలో పడటానికి దీనిని ఓ మోస్తరులో వాడేసుకుంటూ ఉన్నారు. ఇక 'చక్కనమ్మ చిక్కినా అందమే.. జుట్టునమ్మ ఏ కొప్పైనా పెడుతుందని' అనే సామెతలు నేటితరం సెలబ్రిటీలకు బాగా సూటవుతాయి. కాదేది ప్రచారానికి, వార్తల్లో ఉండటానికి అనర్హం అన్నట్లుగా వారి ధోరణి ఉంటోంది. దానికి తోడు మన మీడియాతో పాటు నెటిజన్లు కూడా వ్యక్తిగత పూజకు, అభిమానానికి ఉన్న చిన్న తెరను తొలగించి వేస్తూ, ప్రతి విషయాన్ని వైరల్‌ చేస్తూ నెటిజన్లను వెర్రోళ్లని చేయాలనే పనిని సమర్ధవంతంగా సెలబ్రిటీలు నెరవేర్చుకుంటున్నారు.

Advertisement
CJ Advs

మరోవైపు సోషల్‌ మీడియా వల్లే తమను నెటిజన్లు కించపరుస్తున్నారని చెబుతూనే వాటిని తాము వార్తలో ఉండేందుకు వినియోగించుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే నేటి హీరోయిన్‌ ప్రగ్యాజైస్వాల్‌ ఎన్ని చిత్రాలలో నటించినా కూడా తనదైన ముద్రను ప్రేక్షకుల్లో వేయలేకపోతోంది. కె.రాఘవేంద్రరావు, కృష్ణవంశీలతో చేసిన చిత్రాలు కూడా ఆమెకి ఏమాత్రం గుర్తింపును తేలేకపోయాయి. దాంతో ఈ అమ్మడు ఈసారి తనదైన పంథాలో వార్తల్లో ఉండాలని నిర్ణయించుకుంది కాబోలు... ఓ ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇందులో ఆమె ఏమీ క్లీవేజ్‌ షో చేయకపోయినా, అందరి రూటును కాదని, తనదైన రూట్‌లో వెళ్లింది. సాధారణంగా మహిళలు, అందునా నటీమణులు తమ అందాలకు మెరుగులుదిద్దుకుంటూ తమ డ్రస్‌లు, వేసుకొనే గాజులు నుంచి ముక్కుపుడకలు, చెవి దిద్దులు వంటివి కూడా ఎంతో జాగ్రత్తగా మ్యాచింగ్‌ ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

ఇక సాధారణంగా లేడీస్‌ తమ ఆర్థిక స్తోమతని బట్టి ఎన్నోరకాల చెవిదిద్దులు వంటి వాటిని కొనుక్కుంటారు. అయితే ఒకేసారి ఒకే రకమైన చెవిదిద్దులను పెట్టుకోవడం మనం చూస్తుంటాం. కానీ ప్రగ్యాజైస్వాల్‌ మాత్రం రెండు చెవులకు రెండు విధాలైన చెవిదిద్దులతో దర్శనమిచ్చి.. తన ఫొటోలోని తేడాను గుర్తించమంటూ ఏదో క్విజ్‌, చిన్నపిల్లల సండే స్పెషల్‌లో వచ్చే పజిల్స్‌ తరహాలో తన ఫొటోని ఉంచి, వాటి ద్వారా పదిమంది నోళ్లలో నానేలా చూసుకుంటోంది.

Pragya Jaiswal Promotes Jewellery:

Pragya Jaiswal Different Style Publicity on Her Jewellery <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs