Advertisement
Google Ads BL

హిట్టు అవ్వడం కాదు.. హిట్‌ సినిమాలే తీస్తాడు!


సినిమా రంగంలో ఉండే సక్సెస్‌రేట్‌ మిగిలిన అన్నిరంగాల కంటే ఎంతో తక్కువ. మహా అయితే 10పర్సెంట్‌ మాత్రమే ఇక్కడ సక్సెస్‌రేట్‌ ఉంటుంది. అలాంటిది దిల్‌రాజు తాను నిర్మాతగా తన 14ఏళ్ల కెరీర్‌లో 28 చిత్రాలను నిర్మిస్తే అందులో 22 చిత్రాలు సక్సెస్‌ అయ్యాయంటే దానికి మించిన అచీవ్‌మెంట్‌ మరోటి ఉండదు. చాలా మంది దిల్‌రాజుది గోల్డెన్‌హ్యాండ్‌, ఆయన సినిమా తీస్తే హిట్టవుతుంది అంటారు. కానీ ఆయన తీస్తే సినిమా హిట్‌ కాదు.. ఆయన హిట్‌ అయ్యే చిత్రాలనే జడ్జి చేసి సినిమాలు తీస్తాడు అని చెప్పుకోవడం సమంజసం. నేటితరం జనరేషన్‌ ప్రొడ్యూసర్స్‌కి ఆయన ఓ దిక్సూచి వంటి వాడు. ఇక ఆయన ఈ ఏడాది ఇప్పటికే 'శతమానం భవతి, నేను లోకల్‌, డిజె, ఫిదా, రాజా ది గ్రేట్‌' చిత్రాలతో ఓవర్‌లోని ఆరు బంతుల్లో ఐదింటిని వరుస సిక్సర్లు కొట్టాడు. ఇక 21వ తేదీన నాని, 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి-వేణుశ్రీరాంలతో 'ఎంసీఏ' ద్వారా ఓవర్‌లోని ఆరు బంతులను సిక్సర్లుగా కొట్టిన ఘనతను తన సొంత చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈయన వచ్చే ఏడాది మరింత బిజీ కానున్నాడు.

Advertisement
CJ Advs

శశికుమార్‌ అనే కొత్త దర్శకునితో 'అదే నువ్వు.. అదే నేను', హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో శర్వానంద్‌, నితిన్‌ హీరోలుగా 'దాగుడుమూతలు', మహేష్‌బాబుతో అశ్వనీదత్‌ భాగస్వామ్యంతో వంశీపైడిపల్లి చిత్రం.. ఇలా వరుస సినిమాలను చేయనున్నాడు. మరోవైపు నితిన్‌తో 'దిల్‌' వంటి తన మొదటి చిత్రం తర్వాత 14ఏళ్ల గ్యాప్‌ తీసుకుని సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వంలో 'శ్రీనివాసకళ్యాణం' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక దిల్‌రాజు కాంపౌండ్‌ నుంచి పరిచయమైన దర్శకులంటే ఇక వారికి తిరుగేలేదని చెప్పాలి.

దర్శకుల టాలెంట్‌ని, వారి కథలోని దమ్ముని చూసి, ఆ సినిమా కథకు కావాల్సిన మార్పులు చేర్పులు సూచిస్తూ, అనుకున్న బడ్జెట్‌తో సినిమా తీసి హిట్‌ కొట్టడం ఆయనకే సాధ్యం. ఇక సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ డబ్బుతో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి సినిమాకి ఎంత లాభం వచ్చింది అనేదే నిజమైన విజయానికి గీటురాయి. ఇక్కడ డబ్బులు పోగొట్టుకుని మంచి సినిమా తీశాం.. అంటే ఎవ్వరూ ఆ డబ్బుని తిరిగి ఇవ్వరు. ఓ చిత్రానికి కథ ఎంత ముఖ్యమో, బడ్జెట్‌ కూడా అంతేముఖ్యం. ఈ ఫీల్డ్‌లో నేను లాభాలను మాత్రమే హిట్‌కి ప్రామాణికంగా తీసుకుంటానని చెబుతున్న దిల్‌రాజు, నేటి నిర్మాతలు హిట్‌ అయిన సినిమాలను పక్కనపెట్టి ఫ్లాప్‌ అయిన చిత్రాలను చూసి నేర్చుకోవాలి. ఆ చిత్రం ఎందుకు ఫ్లాప్‌ అయింది అనేది తెలుసుకుంటే నష్టాలలో కాస్తైనా తగ్గుదల ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Dil Raju Success Secret:

Dil Raju Birthday special Artical
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs