ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ ఖాతాలు, ఇతర లావాదేవీలు, సంక్షేమ పథకాల నుంచి మొబైల్ ఫోన్ల వరకు ఆధార్‌ని తప్పనిసరిగా అనుసంధానం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల నంది అవార్డుల వివాదంతో కూడా ఏపీ మంత్రి లోకేష్ ఆధార్-ఓటర్‌కార్డ్‌లు ఏపీలోలేని వారు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది లోకేష్‌పై సెటైర్లు వేస్తూ ఇక నుంచి ఉత్తమ ఆధార్ అవార్డులను ప్రవేశపెట్టాలని, టాయిలెట్స్, సులభ్‌కాంప్లెక్స్‌లలో కూడా ఆధార్‌ని తప్పని సరి చేయాలని తీవ్ర విమర్శలు, సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో అవే నిజమైనా కూడా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. తాజాగా ఎవరైనా విటులకు సెక్స్ వర్కర్లను పంపించాలన్నా కూడా వారి ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డులు, తాము వేశ్యలతో గడపబోయే హోటల్స్ వివరాలు, ఆయా హోటల్ గదులకు సంబంధించిన ఫొటోలను కూడా బ్రోకర్లు కంపల్సరీ చేస్తున్నారు.
ఇక గోవా అంటే అందరికీ సెక్స్ వర్కర్లు, మద్యం, బీచ్‌లు, విదేశీ తరహా విచ్చలవిడితనం నుంచి డ్రగ్స్ వరకు ఆ ప్రాంతమే గుర్తుకు వస్తుంది. తాజాగా ఓ ఐదుగురు ఢిల్లీకి చెందిన యువకులు గోవాకి పర్యటనకు వెళ్లారు. నార్త్ గోవాలోని సముద్రం ఒడ్డున ఉండే ఓ హోటల్‌లో దిగారు. తమకు ఐదుగురు సెక్స్ వర్కర్లు కావాలని బ్రోకర్లను కోరారు. దాంతో బ్రోకర్లు వారి ఫోన్ నెంబర్లని పరిశీలించి వారు ఢిల్లీకి చెందిన వారేనని నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాత వారు ఆ యువకులకు ఫోన్ చేసి వారి ఆధార్ కార్డు జెరాక్స్‌లను, ఇతర ఐడెంటిటీ ప్రూఫ్‌లను, హోటల్ గది రూంని, వాటి తాళం ఫొటోలను కూడా తమకు పంపాల్సిందిగా కోరడంతో విస్తుపోవడం ఆ ఐదుగురు ఢిల్లీ యువకుల వంతైంది. ప్రస్తుతం గోవాలో సెక్స్ వర్కర్స్‌తో పాటు ఇతర డ్రగ్స్, విచ్చలవిడి విధానాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొందరు పోలీసులు కూడా విటుల రూపంలో వచ్చి అరెస్ట్‌లు చేస్తుండటం, రైడ్స్ చేస్తుండటంతో ఈ మద్యవర్తులు ముందు జాగ్రత్తగా ఈ అదనపు విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా విటుల వద్దకు ఎవ్వరినీ పంపడం లేదు.
అంతేకాదు ఒకేసారి ఎక్కువ మంది సెక్స్ వర్కర్లను ఒకేసారి పంపడానికి కూడా నిర్వాహకులు ఒప్పుకోవడం లేదు. ఏదైనా అనుకోని రైడింగ్ జరిగితే అందరు యువతులు ఒకేసారి అరెస్ట్ అయితే అది తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని భావిస్తుండమే దీనికి కారణం. మొత్తంగా వచ్చే కాలంలో విదేశాలలో వలే మన దేశంలో కూడా సెక్స్ వర్కర్ల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.