ఏయన్నార్ బతికి ఉన్నప్పుడు తల్లి లేని బిడ్డలుగా భావించి నాగార్జున కంటే ఎక్కువగా సుమంత్, సుప్రియలను ఎంతో ప్రేమగా చూసుకునే వారు. ఆయన చివరిరోజుల్లో కూడా తాను తన కుమారుల జీవితాలను క్రమశిక్షణలో పెట్టి వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాను గానీ తన మనవడు సుమంత్, మనవరాలు సుప్రియల విషయంలో మాత్రం తాను పెద్దగా సక్సెస్ కాలేకపోయానని అన్నారు. ఇక సుమంత్ విషయానికి వస్తే ఆయన 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకుని ఏడాది కల్లా విడాకులు తీసుకున్నారు. ఇక సుప్రియ భర్త కూడా పలు వివాదాల వల్ల మద్యానికి బానిసై మరణించాడు. ఈయన శ్రియ మొదటి చిత్రం 'ఇష్టం' చిత్రంలో హీరోగా కూడా నటించాడు. ఇలా ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరు వ్యక్తిగత జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొన్నారు.
ఇక కెరీర్ పరంగా కూడా సుప్రియ ఫెయిలయ్యింది. సుమంత్ మాత్రం అమావాస్యకో, పౌర్ణమికో వచ్చి పలకరిస్తున్నాడు. ఇక ఆయన తాజాగా నటించిన 'మళ్లీరావా' చిత్రానికి మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటంతో సుమంత్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఇక నుంచి విభిన్న కథలనే ఎంచుకుంటానని చెబుతున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పెళ్లి మీద పెద్దగా అభిప్రాయం అంటూ ఏమి లేదు. అది కొందరికి వర్కౌట్ అవుతుంది. కొందరికి కాదు. నేను కీర్తి ఏడాదిపాటు కలసి జీవించాం. మా ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదని తెలుసుకున్నాం. విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి విడిపోయాం. అంతకు మించి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. విడిపోయినప్పటికీ నేను కీర్తి ఇప్పటికీ మంచి స్నేహితులమే. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ల కుటుంబ సభ్యులంతా నన్ను ఎంతగానో గౌరవిస్తారు. మా తాతగారు చనిపోయినప్పుడు కీర్తి కూడా వచ్చింది.
ఇక నాగార్జున వల్లనే మేం విడిపోయాం అనే మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు. కీర్తి సోదరుడు నాగ్‌కి మంచి స్నేహితుడు కూడా .. అని చెప్పారు. అయితే సుమంత్, కీర్తి విడిపోవడానికి నాగ్ కారణమనే పుకారులో నిజం లేదు గానీ వీరు విడిపోవడంలో సుమంత్ సోదరి సుప్రియ ప్రమేయం ఎక్కువగా ఉందనే మాట మాత్రం ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.