Advertisement
Google Ads BL

ఫైట్ సీన్లో చిరు ఏ మాత్రం తగ్గడంలేదట!!


మెగాస్టార్ చిరంజీవి వయసులో ఎప్పుడో 60 దాటేశాడు. అంత వయసులోనూ ఇంకా ఎంతో యాక్టివ్ గా ఉన్నాడు చిరంజీవి. అసలు ఆయనలో వయసు పెరిగింది కానీ జోరు మాత్రం తగ్గలేదు. రాజకీయాల్లోకి అడుగెట్టేటప్పటికీ పూర్తి ఫిట్నెస్ తో ఉన్న చిరు.. సినిమాలకు గ్యాప్ ఇచ్చాక కాస్త ఒళ్ళు చేశాడు. కాకపోతే సినిమాలంటే అతడికున్న నిబద్ధత ఏమాత్రం చెక్కుచెదరలేదు. అలా ఎందుకన్నామంటే..  తాజాగా జరుగుతున్న చిరు 151 మూవీ  సైరా షెడ్యూల్ ఈ విషయాన్ని మరోసారి కళ్ళకు కట్టినట్టుగా రుజువు చేస్తోంది. ఆగష్టు లోనే మొదలైన సైరా నరసింహారెడ్డి చిత్రం ఈనెల 6న ప్రారంభమైన సైరా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా జరుగుతుంది.

Advertisement
CJ Advs

సైరా రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా అస్సలు టైం వేస్ట్ చెయ్యకుండా పాల్గొంటున్నాడు. ఉదయం 8 గంటలకే సైరా సెట్స్ కు వెళ్లిపోతున్నాడు. మళ్లీ చీకటి పడేవరకు అక్కడే సైరా సెట్స్ లోనే ఉంటున్నాడు. అలా అలసట లేకుండా పనిచేస్తున్నాడట చిరంజీవి. మరి సైరా షూటింగ్ లో ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ షూటింగ్ మాత్రమే జరగడంలేదు..... కత్తి పట్టి చేసే ఫైట్ సీన్ లో చిరు ఏ మాత్రం తగ్గడం లేదట. ఇంతటి కష్టమైన పనిని కూడా అలిసిపోకుండా చేస్తున్నాడట చిరు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ 22వ తేదీ వరకు జరుగుతుంది.

ఇక ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ వెల్లడిస్తారని తెలుస్తుంది. చిరంజీవి కెరీర్ లో 151వ చిత్రంగా వస్తున్న సైరా నరసింహారెడ్డిని కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి లాంటి బడా స్టార్స్ నటిస్తున్నారు.

Sye Raa Shooting Latest Update:

Sye Raa Fighting Scene Shoots on Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs