Advertisement
Google Ads BL

'హలో' టైటిల్ కి నాగ్ చెప్పిన కహానీ ఇదే!


విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ మొదలు పెట్టిన సినిమా చాలా రోజులు షూటింగ్ జరుపుకున్నాక ఆ సినిమా టైటిల్ ని బయటికి వదిలారు.  చాలా రోజులపాటు టైటిల్ ఎనౌన్స్ చెయ్యకుండా బాగా సస్పెన్సు మెయింటింగ్ చేశారు నాగార్జున అండ్ విక్రమ్ కుమార్ లు. ఎట్టకేలకు హలో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ ని ఇలా ప్రకటించిన వెంటనే అలా అందరికీ అతితక్కువ సమయంలోనే కనెక్ట్ అయిపోయింది. అయితే ఇంతకీ అఖిల్ రెండో సినిమాకు ఆ హలో టైటిల్ పెట్టింది ఎవరు అనే విషయంపై అఖిల్ తండ్త్రి, హలో నిర్మాత... నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

అఖిల్ సినిమా డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాకు టైటిల్ పెట్టడానికి చాలా కష్టపడ్డాం అని.... దాదాపు 3 నెలల పాటు సుమారు 50 టైటిల్స్ చర్చించినా తెగని ఈ టైటిల్ వ్యవహారం....  ఒకరోజు పొద్దున్నే నాగ్ ఎక్సర్ సైజ్ చేస్తుంటే ఓ మెరుపులా హలో అనే టైటిల్ తట్టడం.... వెంటనే నాగ్ మేనకోడలు, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియకు ఫోన్ చేసి ఆ టైటిల్ రిజిస్టర్ చేయించమని నాగ్ చెప్పాడట. ఆ తర్వాత నాగార్జున, దర్శకుడు విక్రమ్ కుమార్ దగ్గరకెళ్లి ఈ టైటిల్ గురించి చెప్పడము.... విక్రమ్ చాలా బాగుందని చెప్పడంతో.. అఖిల్ రెండో సినిమాకి ఇలా హలో టైటిల్ పెట్టమంటూ.... హలో టైటిల్ వెనక జరిగిన తతంగాన్ని బయటపెట్టాడు నాగార్జున.

ఇకపోతే ఈ సినిమా కథకు, ఈ హలో టైటిల్ కు చాలా సంబంధం ఉందని.. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ టైటిల్ తో కనెక్ట్ అవుతారని నాగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అఖిల్ - కళ్యాణి జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 22న రిలీజ్ కాబోతోంది.

Hello Title.. Nagarjuna Tells the Story:

Nagarjuna Hello Title Story Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs