Advertisement
Google Ads BL

రజినీకాంత్.. సూపర్ కాదు గ్రేట్‌ అంతే!


రజనీకాంత్‌ అంటే సామాన్యులకే కాదు.. అమితాబ్‌ నుంచి షారుఖ్‌ఖాన్‌ వరకు ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. స్వయంగా నాటి శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే కూడా ఒకసారి తాను రజనీకి వీరాభిమానిని అని చెప్పాడు. రజనీ నేడు కేవలం సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ కాదు. మొత్తం ఇండియన్‌ సినిమాకే ఆయన ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌. కామిక్స్‌, పురాణాలలో ఉండే హీమ్యాన్‌ లక్షణాలను ఆయనలో చూసుకుంటారు అందరూ. ఆయన ఏం చేసినా కూడా ఆయనకున్న భారీ ఇమేజ్‌ని చూస్తే ఆయన దైవాంశసంభూతినిగా ఉండేలా.. యస్‌.. రజనీ ఒకే చేత్తో వేలమందినైనా కొట్టగలడు అనేంతగా ఆయన ఇమేజ్‌ ఉంది.

Advertisement
CJ Advs

ఇక 1976లో ఆయన 'అంతులేని కథ'లో ఏసు దాస్‌ పాడిన 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి' అనే స్థాయి నుంచి ఇప్పుడు ఆయనే దేవుడై సినిమాకో లుక్‌లో కనిపిస్తుంటాడు. 1976 నుంచి 'భాషా' చిత్రం వచ్చే వరకు రజనీకి కథాబలమున్న చిత్రాలే ప్లస్‌ అయ్యాయి. కానీ 'భాషా' తర్వాత మాత్రం ఆయన మీదనే కథ నడిచేలా మారింది. ఇక నాటి నుంచి నేటి వరకు ఎందరో బిగ్‌స్టార్స్‌ ఉన్నా కూడా రాబోయే చిత్రంలో రజనీ గెటప్‌ ఎలా ఉంటుంది? అనిపించేంత ఆసక్తిని, ఆయన లుక్‌ కోసం కోటికళ్లతో ఎదురు చూసే ఫ్యాన్స్‌ని ఏమి వర్ణించినా తక్కువే. ఇలా తీసుకుంటే ఇండియన్‌ సినీ హిస్టరీలోనే రజనీ ఫస్ట్‌లుక్స్‌ అనే ట్రెండ్‌కి తెరదీశాడు. కానీ గత మూడేళ్లుగా రజనీ తన అభిమానులను తన బర్త్‌డే వేడుకలను జరుపుకోవద్దని చెబుతూ వస్తున్నాడు.

ఒకసారి చెన్నై వరదలు, మరోసారి జయ మరణం, మరలా ఈ సారి కూడా వరదలు. ఇక ఆయన రాజకీయాలలోకి వస్తాడని, దాని గురించి ఆయన బర్త్‌డే అయిన డిసెంబర్‌12న ఏదైనా ప్రకటన వస్తుందని రజనీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆయన ఆ విషయంలో నోరు విప్పలేదు. దాంతో ఓ రజనీ అభిమాని ఆత్మహత్యయత్నం చేశాడు. ఇక రజనీ వచ్చే ఏడాది '2.0'తో పాటు 'కాలా'గా వస్తున్నాడు. రెండింటి లుక్స్‌ బయటికి వచ్చాయి. మరి పాలిటిక్స్‌ సంగతేమోగానీ ఆయన వచ్చే ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకులకు డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నాడు!

Again Revealed Super Star Rajinikanth Greatness:

Rajinikanth Treat with 2 Movies in 2018 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs