Advertisement
Google Ads BL

దేవిశ్రీ మార్క్ డౌనైపోతుంది..!


గత రెండు దశాబ్దాల్లో టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హవానే నడిచింది. ఇతను పెద్ద పెద్ద హీరోస్ కి మ్యూజిక్ అందించి ఆ హీరో ఫ్యాన్స్ ను ఇతని వైపు తిప్పుకున్నాడు. తన మ్యూజిక్ తో మేజిక్ చేసిన దేవి.. కమర్షియల్ గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇతనికి ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ అందించగల సత్తా వున్న మ్యూజిక్ డైరెక్టర్.

Advertisement
CJ Advs

ఐతే ఈ మధ్య మాత్రం దేవిశ్రీ మ్యూజిక్ కొంచెం రొటీన్ అయిపోతోందని.. అతను ఒక ఫార్మాట్లో సాగిపోతున్నాడని విమర్శలు వస్తున్నాయి. దేవి నుంచి వచ్చిన కొత్త ఆల్బం ‘ఎంసీఏ’ అయితే ఏమాత్రం కొత్తదనం లేకుండా తయారైంది. ఈ సినిమా ఆల్బం మొత్తం రొటీన్ గానే ఉందని చెబుతున్నారు. ఈ ఆల్బంతో పాటు అనూప్ స్వరాల అందించిన హలో సినిమా సాంగ్స్ ఆల్బంకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ఇక తమిళ్ రాక్ స్టార్ అనిరుద్ తొలిసారి తెలుగులో మ్యూజిక్ చేసిన అజ్ఞాతవాసి సాంగ్స్ కూడా అదిరిపోయాయి అంటున్నారు. ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ బయటికి వచ్చినప్పటికి ట్రెండ్ ను క్రియెట్ చేశాయి. మొత్తానికి దేవి వీక్ ఆడియో ఇచ్చిన సమయంలోనే ఇటు అనూప్.. అటు అనిరుధ్ అదిరిపోయే పాటలతో అతడిని ఇరుకున పెట్టారు. ఇక ‘రంగస్థలం’.. ‘భరత్ అను నేను’ ఆడియోలతో దేవి మళ్లీ తన ముద్ర చూపించకుంటే.. అతడికి మున్ముందు కష్టమే అవుతుంది.

Anirudh And Anup Rubens Dominates Devi Sri Prasad:

Devisri Prasad Mark Downed in tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs