Advertisement
Google Ads BL

పెద్దోడు, చిన్నోడు తోనేనా త్రివిక్రమ్ మూవీ..!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుండి సినిమా వస్తుంది అంటే.... అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. త్రివిక్రమ్ సినిమాలు అన్ని....  కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమాలుగా ఉంటాయి. కాసింత ప్రేమ, కాసింత కామెడీ, కాసింత యాక్షన్ పార్ట్..  ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను శాటిస్ఫై చెయ్యగల సమర్ధవంతమైన దర్శకుడు త్రివిక్రమ్. అలా ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టి త్రివిక్రమ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న 'అజ్ఞాతవాసి' పై ఉంది. ఈ సినిమా జనవరి 10 న సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

Advertisement
CJ Advs

ఇక అజ్ఞాతవాసి సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్... ఎన్టీఆర్ తో ఒక సినిమాని పట్టాలెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలతో పాటే... ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్దం చేసి షూట్ కి రెడీగా ఉంచాడు. ఇక ఎన్టీఆర్ తో సినిమా అలా.. పూర్తి కాగానే త్రివిక్రమ్.. విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమాని లైన్ లో పెట్టేసాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నుండి ఆల్రెడీ వచ్చేసింది. అయితే అలా ఆ సినిమా అనౌన్సమెంట్ అయ్యిందో లేదో.. అనేక రకాల అనుమానాలతో ఫిలింనగర్ వాసులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఎందుకంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తదుపరి సినిమాని మహేష్ చేస్తాడనుకుంటే.. ఇప్పుడు వెంకీతో కమిట్ అయ్యి అందరిని కన్ఫ్యూజన్ లో పడేసాడంటున్నారు. అయితే ఇప్పుడా కన్ఫ్యూజన్ కి తెర దించుతూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే త్రివిక్రమ్ - వెంకటేష్ సినిమాలో వెంకీ ఒక్కడే హీరో కాదంట. వెంకటేష్ తో పాటు మరో హీరోకి కూడా ఈ మూవీ లో చోటుంది అనే టాక్ వినబడుతుంది. అయితే ఆ హీరో మరెవరో కాదు ఆల్రెడీ వెంకటేష్ తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి మల్టీస్టారర్ మూవీ లో నటించిన మహేష్ బాబు అంటున్నారు. ఈ సినిమాని ఒక మల్టీస్టారర్ గా త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నాడని ఫిలింనగర్ టాక్. మరి ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాలి అంటే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే అంటున్నారు.

Trivikram Movie with Venkatesh and Mahesh Babu:

Trivikram Eye on Seethamma Vaakitlo Sirimalle Chettu Combination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs