Advertisement
Google Ads BL

పవన్‌ గుండుని పట్టుకుందేంటి రోజా..?


నాడెప్పుడో ఓ స్థలం విషయంలో వచ్చిన గొడవ వల్ల పరిటాల రవి పవన్‌కళ్యాణ్‌కి గుండు కొట్టించాడనే వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక పరిటాల రవి హత్య జరిగినప్పుడు నాడు మెగాభిమానులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని నానా హంగామా చేశారు. దాంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక తాజాగా పవన్‌ ఏపీలో జరిపిన నాలుగు రోజుల కార్యక్రమంలో తన గుండు గురించి మరోసారి మాట్లాడి మరలా ఆ వార్తను హైలైట్‌ చేశాడు. తనకెవ్వరు గుండు కొట్టించలేదని, తానే చికాకుగా ఫీలై తనకు తాను గుండు కొట్టించుకున్నానని పవన్‌ వివరించాడు.

Advertisement
CJ Advs

ఇక పరిటాల రవి భార్య మంత్రి పరిటాల సునీత కూడా తన భర్త పవన్‌కి గుండు కొట్టించడం నిజం కాదని, పవన్‌కి గుండు కొట్టాంచాల్సిన అవసరం తన భర్తకు ఏమిటని? స్పందించింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా పవన్‌ని గుండు కొట్టించింది నిజమేనని సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్‌కి గుండు కొట్టించినప్పుడు తాను టిడిపిలోనే ఉన్నానని చెప్పిన ఆమె ఆ విషయంలో మాత్రం తనకేమీ సంబంధం లేదని తెలిపింది. ఇక పవన్‌ గుండు విషయంలో చెబుతున్న తేదీలను పరిశీలిస్తే అది నిజమేననిపిస్తోందని వ్యాఖ్యలు చేసింది. పనిలో పనిగా 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పవన్‌కి గుండు కొట్టించిందని, మరోసారి 2019లో పవన్‌కి మరోసారి టిడిపి గుండు కొట్టించడం ఖాయమని సెటైర్లు వేసింది. ఈ విషయంలో పవన్‌ కాస్త జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించింది.

ఇక పరిటాల రవి వంటి వారు రాజకీయాలలో తమ హవా సాగుతుండటంతో వారు చేసిన పనులపై ఉన్న కోపంతోనే పవన్‌ నేడు రాజకీయపరంగా తాను కూడా ఓ బలవంతునిగా ఎదగాలని భావిస్తున్నాడని, పవన్‌ కసిగా రాజకీయాలలోకి రావడానికి కారణం కూడా ఇదేనని కొందరు అంటుంటారు. మరి ఏది నిజమో వారికే తెలియాలి....!

YCP MLA Roja Sensational comments on Pawan kalyan Gundu issue:

MLA Roja Satires on Pawan Kalyan Gundu <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs