ప్రస్తుతం బాలీవుడ్‌ని దాటి తన క్రేజ్‌ని హాలీవుడ్‌కి వ్యాపించజేసుకుంటున్న స్టార్ హీరోయిన్ ప్రియాంకాచోప్రా. ఈమె హాలీవుడ్‌లో 'క్వాంటినో' టీవీ సీరిస్‌తో పాటు 'బేవాచ్'లో నటించింది. ఇక ఆమె ఓ నిర్మాణ సంస్థను స్థాపించి, నిర్మాతగా 'వెంటిలేటర్, సర్వన్' వంటి మరాఠి, పంజాబీ చిత్రాలను కూడా నిర్మిస్తోంది. ఆమె నిర్మాణంలో మరో రెండు చిత్రాలు నిర్మాణం కానుండగా, మరో రెండు హాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. ఇక ఈమెకి సోషల్‌మీడియాలో అత్యధిక ఫాలోయర్స్‌ని సంపాదించుకున్న సందర్బంగా ఇన్‌స్టాగ్రామ్ అవార్డులు సాధించడమే కాదు... తాజాగా ఆసియాలోని సెక్సీయెస్ట్ ఉమెన్‌గా కూడా ఎంపికైంది.
ఇక ఈమె 2016లో ప్రోడ్యూసర్స్ గిల్డ్ అవార్డుల వేడుకలో వేదికపై లైవ్ డ్యాన్స్‌షోని చేసింది. మరలా ఇంత కాలానికి ఆమెను జీ నెట్‌వర్క్ సంస్థ డిసెంబర్ 19న జరిగే జీ సీనీ అవార్డుల వేడుకలో ఐదు నిమిషాల పాటు లైవ్ డ్యాన్స్ షోని చేసేందుకు ఒప్పించింది. ఈ వేడుకలో ఆమె ఐదు నిమిషాల పాటు బాలీవుడ్‌లోని సూపర్‌హిట్ సాంగ్స్ బిట్స్‌కి డ్యాన్స్ చేయనుంది. దీనికోసం ఆమె ఏకంగా 5కోట్లు డిమాండ్ చేసినా కూడా ఆమె డ్యాన్స్‌షోకి వచ్చే క్రేజ్ దృష్ట్యా జీ నెట్‌వర్క్ అంత మొత్తం చెల్లించడానికి రెడీ అయింది. అంటే నిమిషానికి కోటి రూపాయలను ఆమె తీసుకుంటుండటం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. మరోపక్క మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. పలు సంస్థలు డిసెంబర్ 31రాత్రిన ప్రియాంకా చోప్రా చేత డ్యాన్స్‌షోలు ఇప్పించాలని క్యూకడుతున్నాయి.
ఈ లెక్కన ఆమె న్యూ ఇయర్ వేడుకలకి కూడా భారీమొత్తం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ప్రియాంకా చోప్రా తర్వాత న్యూఇయర్ వేడుకల విషయంలో ఆ తర్వాత స్థానాలలో దీపికాపడుకోనే, సన్నిలియోనులు మంచి పోటీతో భారీగా రెమ్యూనరేషన్‌ని డిమాండ్ చేస్తున్నారు.