ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ప్రేమించి పెళ్లాడారు. అసలు ఎన్ని లవ్ మ్యారేజేస్ ఉన్నా గాని ఎక్కువ పాపులర్ అయినా ప్రేమ జంట, పెళ్లి చేసుకున్న జంట మాత్రం సమంత ఇంక నాగ చైతన్య. ఎందుకంటే ఎవరికీ చెప్పకుండా గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్న వీళ్ళు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లిని అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు ఘనంగానే జరిపించారు. పెళ్లి సింపుల్, రిసెప్షన్ ఒకటి సింపుల్, మరొకటి గ్రాండ్ గా నిర్వహించారు కూడా.
ఇకపోతే సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి సమంతకి నాగ చైతన్య తోడుగా ఉన్నాడు. అలాగే సమంత కూడా సౌత్ లో స్టార్ హీరోయిన్ అయినా గాని నాగ చైతన్యతో అనుబంధాన్ని ఎప్పుడు వదులుకోలేదు. అంతేకాకుండా సమంత అయితే నాగ చైతన్య తనకి ప్రతి విషయంలో అంటే కష్టసుఖాల్లో ఎంతో అండగా ఉన్నాడు అని చాలా సంధర్బాల్లో చెప్పుకొచ్చింది. అలాగే చైతుతో సమంత తన అనుబంధాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తోనే వుంది. సమంత ఎప్పుడు నాగ చైతన్య గురించి చెప్పడమే గాని ఎప్పుడు నాగ చైతన్య మాత్రం సమంత గురించిన మాటలు అందరితో పంచుకోడు. ఎప్పుడు సైలెంట్ గా, గుంభనంగా ఉంటాడు.
కానీ మొదటిసారి నాగ చైతన్య, సమంతతో తనకున్న అనుబంధాన్ని గురించి పెదవి విప్పాడు. ఒక జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన నాగ చైతన్యను అక్కడి మీడియా వారు సమంతతో మీ వైవాహికి జీవితం ఎలా ఉంది అనే ప్రశ్న అడగ్గానే ఏమాత్రం కూడా ఆలోచించకుండా పెళ్లి తరవాత జీవితం చాలా హాయిగా, సంతోషంగా ఉంది. సమంత లాంటి భార్య నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అంటూ నవ్వుతూ జవాబిచ్చాడు చైతు. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తుండగా, సమంతా 'రంగస్థలం', 'మహానటి' మూవీస్ తో బిజీగా ఉంది.