Advertisement
Google Ads BL

చర్చ కాదు.. అది బూతు పురాణం!!


తాజాగా ఓ చానెల్‌లో జరిగిన కార్యక్రమంలో పవన్‌కళ్యాణ్‌కి, మెగాఫ్యామిలీకి వీరాభిమాని అయిన బండ్ల గణేష్‌, ఒకనాటి స్టార్‌ హీరోయిన్‌, ప్రస్తుతం వైసీపీ నేతగా, నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా మద్య వాగ్వివాదం చివరకు బూతులు, తిట్ల వరకు సాగింది. ఇద్దరు కలిసి బజారు మాటలు మాట్లాడుతూ, ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇక వీరి చర్చ ద్వారా టీఆర్పీల కోసం నవగ్రహ చానెల్‌ కూడా వారిని మరింత కెలికి రెచ్చగొట్టింది. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సంయమనం కోల్పోకుండా ఉండాల్సింది. కానీ ఈ ఇద్దరు బాధ్యతాయుతమైన వ్యక్తుల మాటలు, ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిపై ఫిల్మ్‌క్రిటిక్‌ మహేష్‌ కత్తి స్పందించాడు. 

Advertisement
CJ Advs

ఈయన ఈ విషయంపై ట్వీట్‌ చేయడమే కాదు... ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశాడు. ఎవరైనా బాధ్యతాయుతమైన వారు తమపై తాము నియంత్రణ కోల్పోతే వారికి విలువ ఉండదని, ప్రజల్లో చులకనైపోతారని అన్నాడు. ఇక బండ్ల గణేష్‌ ఓ బాధ్యతాయుతమైన నిర్మాత. ఓ మహిళగా రోజాకి ఆయన ఆ గౌరవం, హోదా ఇవ్వాల్సిందే గానీ బండ్ల ప్రవర్తన అలా లేదు. ఇక రోజా ఎంతో ఉన్నతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. ఆమె నుంచి ఇలాంటి మాటలు వినాల్సిరావడం బాధాకరం. చర్చ చర్చగానే సాగాలి గానీ అది రచ్చగా, రభసగా మారకూడదు. నా దృష్టిలో అసలు ఇది చర్చే కాదు.. బూతు పురాణం. ఇకనైనా వీరు హుందాగా ప్రవర్తిస్తారని, మరీ ముఖ్యంగా అందరు చూసే మీడియాలోనైనా తమ సంయమనం కోల్పోకుండా ఉంటారని భావించడం మినహా మరేమి చేయలేమని వ్యాఖ్యానించాడు. 

ఇక తాజా చర్చతో మెగాభిమానులు, ముఖ్యంగా పవన్‌ అభిమానులు రోజాపై మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే సినిమా వేరు, రాజకీయం వేరు, వినోదం వేరు అని నాగబాబు చెప్పినా కూడా ఇక నుంచి ఆయన రోజాతో కలసి 'జబర్దస్త్‌' షో చేయకూడదని మెగాభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నాగబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.

Kathi Mahesh Comment on Roja and Bandla Ganesh Fight:

Verbal War Between Roja and Bandla Ganesh 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs