ఇదివరకు టాలీవుడ్ లో తెగ సినిమాలు చేసింది నయనతార. కానీ కొన్ని ఏళ్ళ నుండి కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ అమ్మడు. ఫుల్ గా లేడీ ఓరియంట్ మూవీస్ మాత్రమే చేస్తూ వచ్చింది. కమర్షియల్ సినిమాలను అసలు ఎంకరేజ్ చేయట్లా. కానీ బాలకృష్ణతో మాత్రం 'సింహా , శ్రీరామరాజ్యం, జై సింహా' సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. టాలీవుడ్ లో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే అది బాలయ్యతోనే చేస్తుంది నయనతార.
ప్రస్తుతం నయనతార తెలుగులో నటిస్తున్న 'జై సింహా' సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తి చేసేశాడు దర్శకుడు కె.ఎస్.రవికుమార్. అయితే పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అందుకే బాలయ్య - నయనతారలపై ఓ పాటను తాజాగా దుబాయ్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు సంబంధించి నయనతార స్టిల్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఈ స్టిల్ లో నయన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఈ పాటలో నయన్ నిలువెత్తు గౌను వేసుకుని ఒక సిండ్రెల్లా తరహాలో కనిపిస్తోంది.
అందమైన లుక్ తో నయన్ అందాలు మెరిసిపోతున్నాయి. ఇకపోతే అనుకున్న టైంకే జై సింహా సినిమాని కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో దింపాలి అనుకున్నారు. అయితే ఇప్పటివరకు పూర్తిగా పబ్లిసిటీ కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టలేదు జై సింహా చిత్ర బృందం. మరోపక్క షూటింగ్ కంప్లీట్ చేసుకుని డేట్ కూడా ఇచ్చేసి అజ్ఞాతవాసి ప్రమోషన్స్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. కానీ జై సింహా ఇంకా షూటింగ్ దిశలోనే వుంది. మరి సంక్రాంతికి ఈ సినిమా వస్తుందో రాదో అన్న డౌట్ లో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు.