Advertisement
Google Ads BL

అర్జున్ రెడ్డికి 'ఫిదా' అయ్యాడుగా!


'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంలో హీరో గ్యాంగులో ఒకడిగా నటించాడు విజయ్‌దేవరకొండ అలియాస్‌ అర్జున్‌రెడ్డి. తర్వాత 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో బాగానే ఆకట్టుకున్నాడు. ఎంతో ఫీల్‌గుడ్‌ మూవీగా వచ్చిన 'పెళ్లిచూపులు' చిత్రం పెద్ద హిట్టయింది. కానీ ఆ తర్వాత వచ్చిన 'అర్జున్‌రెడ్డి' అయితే ఏకంగా సెన్సేషన్స్‌ క్రియేట్‌ చేసి, ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. దాంతో విజయ్‌ ఓవర్‌నైట్‌లో యూత్‌ ఐకాన్‌గా, స్టార్‌గా మారిపోయాడు. ఆయన నటనకు ఎందరో ఫిదా అయ్యారు. 'అర్జున్‌రెడ్డి' కథ, కథనాలలలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రతిభ ఎంత ఉందో ఆ పాత్రను చేసిన విజయ్‌కి కూడా ఆ విజయంలో సమానమైన పాత్ర ఉంది. ఆ తర్వాత ఆయనతో చిత్రాలు చేయడానికి అందరూ క్యూ కడుతున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈ హీరో తన ఆటిట్యూడ్‌తో కూడా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన పరుశురామ్‌ దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ బేనర్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. 'అర్జున్‌రెడ్డి' తర్వాత వచ్చే చిత్రం మరింత కొత్తదనం, వైవిధ్యం కలిగి మరింత ఉన్నతస్థాయిలో ఉండాలని భావిస్తున్నాడు విజయ్‌. కాగా ఈ చిత్రానికి 'గీతా గోవిందం' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక కెమెరామెన్‌ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. దీనికి 'షికారు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇది వచ్చే వేసవికి విడుదల కానుంది. ఈ మధ్యలోనే ఆయన ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న 'మహానటి' చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఇలా అతి కొద్ది కాలంలోనే అర్జున్‌రెడ్డి మూడు చిత్రాలను విడుదల చేయడానికి సిద్దమవుతున్నాడు.

మరోవైపు ఆయన మరో మూడు నాలుగు సినిమాలను కూడా ఒప్పుకున్నాడు. ఇక 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'లో విజయ్‌కి ఓ పాత్ర ఇచ్చిన శేఖర్‌కమ్ముల ఎంతో కాలం తర్వాత మరలా 'ఫిదా' చిత్రంతో ఫామ్‌లోకి వచ్చాడు. తాజాగా శేఖర్‌కమ్ముల విజయ్‌దేవరకొండని కలిసి ఓ స్టోరీ చెప్పడం, దానికి విజయ్‌ ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. సో.. శేఖర్‌కమ్ముల తదుపరి చిత్రం విజయ్‌దేవరకొండతోనే అని అంటున్నారు. ఇక ఈచిత్రాన్ని స్వంతంగా విజయ్‌ గానీ లేదా శేఖర్‌కమ్ముల గానీ ప్రొడ్యూస్ చేయనుండటంతో ఈ సినిమా స్టోరీపై వారికున్న నమ్మకం అర్ధమవుతోంది.

Vijay Devarakonda in Sekhar Kammula Direction:

Vijay Devarakonda and Sekhar Kammula Combo soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs