మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ళు సినిమాలకు దూరమై రాజకీయాలతో బిజీగా గడిపాడు. కానీ రాజకీయాల్లో సక్సెస్ కాక మళ్ళీ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాడు. రావడం రావడమే 'ఖైదీ నెంబర్ 150' తో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. కాస్త వళ్ళు చేసినా... చిరు మాత్రం మెగా ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. కాకపోతే డాన్స్ ల్లో గ్రెస్, ఫైట్స్ లో స్పీడ్, వాయిస్ లో ఫోర్స్ తగ్గిందనే కామెంట్స్ పడ్డాయి. కానీ ఖైదీ హిట్ తో అవన్నీ పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపించలేదు గాని... అవి మాత్రం వాస్తవాలే. వయసుతో వచ్చిన వాయిస్ లో ఫోర్స్ తగ్గడం నిజంగానే ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది. కొన్ని డైలాగ్స్ లో చిరు పవర్ ఫుల్ డైలాగ్స్ ని పవర్ ఫుల్ గా చెప్పలేకపోయాడు.
అయితే ఇప్పుడు తన 151 మూవీ ఉయ్యాలవాడ జీవిత చరిత్రని సై రా నరసింహారెడ్డిగా సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు చిరు. మరి ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలకు డైలాగ్స్ లో పవర్ ఎంతో కీలకం. వాయిస్ లో ఫోర్స్ ఉంటేనే ఆయా పాత్రలకు ప్రాణం పోస్తారు. లేదంటే ఆ పాత్ర తేలిపోతుంది. ఆక్రోశం, పౌరుషంతో డైలాగ్స్ చెప్పేటప్పుడు అందులో ఫోర్స్ లేకపోతే చాలా కష్టం. మరి ఖైదీలోలా చిరు వాయిస్ సై రా లో ఎలా ఉంటుందో అనే అనుమానంలో ఉన్నారు ఫ్యాన్స్.
అయితే ఇప్పుడు తాజాగా చిరు వాయిస్ లో మార్పు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. అయితే ఈ మధ్యన చిరు మాట్లాడిన మాటలు, ప్రసంగం వింటే చిరు వాయిస్ లోని స్పష్టత గ్రేస్ అర్ధమవుతుంది. తాజాగా చిరు తెరవెనుక దాసరి పుస్తకావిష్కరణలో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో చిరు వాయిస్ చాలా గంభీరంగా అనిపించింది. ఆ ప్రసంగంలో ఎటువంటి తడబాటు లేకుండా... అనర్గళంగా మాట్లాడి తన వాయిస్ లో ఎంతో మార్పు వచ్చిందని చెప్పకనే చెప్పేశాడు. మరి నిజంగానే సై రా కోసం చిరంజీవి వాయిస్ మీద దృష్టి సారించాడా? అందుకే వాయిస్ లో ఆ మార్పు కనబడుతుందా? అనేది మాత్రం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.