Advertisement
Google Ads BL

అజ్ఞాతవాసి ఫంక్షన్ కి ఎన్టీఆర్ వస్తున్నాడంట!


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అను ఇమ్మాన్యువల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఈ సినిమా జనవరి 10  సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా గురించిన ఆసక్తికర విషయమొకటి బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో పవన్ కళ్యణ్ ఫ్రెండ్, సీనియర్ హీరో వెంకటేష్ ఒక అతిధి పాత్ర చేశాడనే న్యూస్ హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇప్పటికే పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు కలిసి గోపాల గోపాలలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిధి పాత్రే అయినప్పటికీ సినిమాలో ఎక్కువ సేపే పవన్ కళ్యాణ్ కనబడతాడు. అయితే అప్పుడు వెంకీ కోసం పవన్ గెస్ట్ రోల్ ప్లే చేస్తే.. ఇప్పుడు పవన్ కోసం వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేశాడంటున్నారు. అయితే ఈ వార్త నిజమే అని ఒక టీవీ ఛానల్ వారు ధ్రువీకరించారు. అలాగే అజ్ఞాతవాసి ప్రమోషన్స్ ప్రస్తుతానికి పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన అజ్ఞాతవాసి పాటలు మార్కెట్ లో హల్చల్ చేస్తుండగా. ఇప్పుడు అనిరుద్ విడుదల చేసిన అనిరుద్ ఆలపించిన గాలి వాలుగా.. వీడియో సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఇకపోతే ఈనెల 19 న గాని లేకుంటే ఇతర తేదీలలో గాని జరిగే అజ్ఞాతవాసి ఆడియో కార్యక్రమానికి గెస్ట్ గా ఎన్టీఆర్ రాబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ కి ఎన్టీఆర్ ని రమ్మని త్రివిక్రమ్ ఆహ్వానించాడని... ఎందుకంటే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా హీరో ఎన్టీఆర్ కాబట్టి.. త్రివిక్రమ్ ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి హాజరవుతాడని... ప్రస్తుతం విదేశాల్లో  ఫ్యామిలీ టూర్ లో ఉన్న ఎన్టీఆర్ ఈ ఆడియో వేడుక కోసం హైదరాబాద్ రానున్నాడని అంటున్నారు. ఇదే గనక నిజమైతే అటు పవన్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు.

Agnathavasi Special For Fans:

NTR Special Guest for Agnathavasi audio 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs