అందరికళ్ళు ఇప్పుడు 2018 సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల మీదే ఉన్నాయి. ఇప్పటికే పవన్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహా పోటాపోటీగా బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇకపోతే మిగిలిన వాటిలో ఏ ఏ సినిమాలు సంక్రాంతికి విడుదలవుతాయి అనే దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. ఎందుకంటే కోలీవుడ్ నుండి వస్తున్న సూర్య గ్యాంగ్ సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. కానీ విశాల్ నటిస్తున్న అభిమన్యుడు మాత్రం జనవరి 26 కి వెళ్ళిపోయింది.
ఇక మిగిలిన సినిమాలలో ఏమేమి సినిమాలు సంక్రాంతికి వస్తాయో క్లారిటీ లేదు. నిన్నటిదాకా రాజా తరుణ్ రంగుల రాట్నమో... లేదంటే రాజుగాడు సినిమానో సంక్రాంతి రేస్ లో ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. మరోపక్క మాస్ మహారాజ్ రవితేజ టచ్ చేసి చూడు కూడా సంక్రాంతికి పవన్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహాని ఎదుర్కొనబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ.. రవితేజ సినిమాల సందడి కానీ ఎక్కడా కనబడడం లేదు. సంక్రాంతికి విడుదల కానున్న అజ్ఞాతవాసి, జై సింహ ఒక రేంజ్ లో సందడి చేస్తుంటే.. అటు టచ్ చేసి చూడు, రాజుగాడు, రంగులరాట్నంల సందడి మచ్చుకైనా కనబడడం లేదు.
అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ మాటెలా ఉన్నా కూడా రవితేజ టచ్ చేసి చూడు మాత్రం సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే... టచ్ చేసి చూడుకి సంబందించిన రీషాట్స్ జరగడం వలనే ఈ సినిమా సంక్రాంతి రేస్ నుండి తప్పుకుందని టాక్ బయటికొచ్చింది. మరి సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటే మళ్ళీ కొత్త డేట్ చూసుకోవడం చాల కష్టమైన పనే. ఎందుకంటే... సంక్రాంతి అయ్యాక జనవరి 26 నుండి ఏప్రిల్ వరకు బోలెడు సినిమాలు విడుదలకు లైన్ లో ఉన్నాయి. చూద్దాం రవితేజ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుంటాడో అనేది.