తాజాగా తెలుగు కమెడియన్ విజయ్‌సాయి మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. విజయ్‌సాయి అందరితో నవ్వుతూ, ఎంత యాక్టివ్‌గా కనిపించేవాడు. కానీ ఆయన స్వయంగా ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఆయన భార్య వనితారెడ్డి, ఆమె తరపు లాయర్, శశిధర్ వంటి వారి వేధింపులే దీనికి కారణమని విజయసాయి తల్లిదండ్రులు అంటుంటే, ఆయన భార్య వనిత మాత్రం ఆయనకు తన తండ్రితో ఓ స్థలం విషయంలో గొడవ ఉందని, ఆయన మరణం తనకు అనుమానాస్పదంగా ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఇక విజయసాయికి అమ్మాయిల పిచ్చి ఉందని, ఆయనకు హెచ్‌ఐవి కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోవైపు విజయసాయి చనిపోయే ముందు ఆయనకు వనితకు పెద్ద గొడవే జరిగిందని అంటున్నారు. ఆయనను విడాకుల కేసు ఎత్తివేయడానికి మూడు కోట్లు ఆయన భార్య డిమాండ్ చేసిందని, చివరకి ఆమె, ఆమె సన్నిహితులైన లాయర్, శశిధర్‌లు వచ్చి కారుతో సహా సామాన్లు కూడా ఎత్తుకు వెళ్లడం, తన పాప తన తల్లి వద్ద ఉంటే చెడిపోతుందనే భయంతో విజయసాయి బాగా బాధపడుతూ, కుమిలిపోయేవాడని అంటున్నారు. మరోవైపు ఆయన భార్య విజయసాయి తనను తీవ్రంగా వేధించి, కొట్టేవాడని, మూడు సార్లు అబార్షన్ కూడా చేయించాడని అంటోంది. ఇలా వాదోపవాదాలు జరుగుతున్న నేపద్యంలో పోస్ట్‌మార్టం పూర్త్తయిన తర్వాత విజయసాయి అంత్యక్రియలు జరిగాయి. దీనికి సినీ రంగ ప్రముఖులు పలువురు వచ్చారు.
ఈ సందర్భంగా నటుడు, రచయిత ఉత్తేజ్ మాట్లాడుతూ తనకు ఏ సమస్య వచ్చినా చూసుకోవడానికి తన తండ్రి ఉన్నాడని చెప్పేవాడని, ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంతో తెగింపు, కావాలి. ఇలాంటి ఘటనలు జరిగితే ఎంతో బాధగా ఉంటుంది. చివరకు ఇలా జరిగింది. కళల ప్రపంచంలో అందరూ సంతోషంగానే ఉంటారని, కానీ నిజజీవితం అలా ఉండదని ఉత్తేజ్ బాధాతప్త హృదయంతో కన్నీరు కార్చారు.