Advertisement
Google Ads BL

సోదరికి బెస్టాఫ్‌ లక్‌ చెప్పిన సూపర్‌స్టార్‌!


సూపర్‌స్టార్‌ కృష్ణ కుమార్తె మంజుల అనేక కారణాల వల్ల హీరోయిన్‌ కాలేకపోయింది. ఇక నిర్మాతగా ఓకే అనిపించుకుంది. కానీ తనలోని క్రియేటివిటీని బయటకు తీసి మెగాఫోన్‌ చేతబట్టి దర్శకురాలి అవతారం ఎత్తింది. అసలే తెలుగులో సరైన లేడీ డైరెక్టర్లు లేని కొరత చాలా ఉంది. దాంతో మంజులపై ఎన్నో ఆశలున్నాయి. ఆమె తన మొదటి చిత్రాన్ని సందీప్‌కిషన్‌ హీరోగా, అమైరా దస్తూర్‌, త్రిధా చౌదరి హీరోయిన్లుగా 'మనసుకు నచ్చింది' అనే చిత్రం చేస్తోంది. బహుశా ఈచిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. సందీప్‌కిషన్‌కి తమిళంలో కూడా గుర్తింపు ఉండటం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.

Advertisement
CJ Advs

ఇక ప్రీలుక్‌లోనే సముద్రపు ఒడ్డును ప్రేయసి ప్రియులు కూర్చొని సముద్రం వైపు హీరో చూస్తుంటే ఆయన వైపు హీరోయిన్‌ చూస్తున్న లుక్‌ ఎంతో పొయిటిక్‌గా ఉంది. ఇక తాజాగా ఈ చిత్రం టీజర్‌ కూడా విడుదలైంది. ఇందులో అమైరా దస్తూర్‌ సందీప్‌కి స్నేహితురాలిగా ప్రకృతి ప్రేమికురాలిగా ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రతి మనిషిలో ప్రపంచమంత ప్రేముంటుందిరా...! కానీ 0.1 పర్సెంట్‌ కూడా బయటికి రావడం లేదు. ఒక్కసారి మన హార్ట్‌తో మనం కనెక్ట్‌ అయితే ఆ ప్రేమంతా పరిచయమవుతుందని హీరోయిన్‌ చెబుతున్న డైలాగ్‌, జలపాతం, కొండలు, దట్టమైన చెట్లు.. ఇలా ప్రకృతి అందాల నడుమ ఈ టీజర్‌ మంచి రొమాంటిక్‌ మూడ్‌లో సాగింది. సాయిమాధవ్‌ బుర్రా మాటలు, మంజుల టేకింగ్‌ స్టైల్‌ ఎంతో డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇందులో మంజుల కుమార్తె, మహేష్‌ మేనకోడలు జాన్వి కూడా కీలకమైన పాత్రను చేస్తుండగా, మంజుల భర్త సంజయ్‌ స్వరూప్‌, ఆనంది ఆర్ట్స్‌ కిరణ్‌లు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక టీజర్‌ని చూసి మహేష్‌ ప్రశంసలతో ముంచెత్తారు. టీజర్‌ ఎంతో ఫ్రెష్‌గా ఉంది. ఎంతో కూల్‌గా ఉంది. అని చెబుతూ, తన సోదరి మంజులకు మహేష్‌ ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ, ట్వీట్‌ చేశాడు. మొత్తానికి టీజర్‌ మాత్రం అదరహో అని మరో కొత్తదనం ఉన్న చిత్రం అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని రెండు మూడు చిత్రాలతో పోటీ పడుతూ జనవరి 26వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి క్రియేటివ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేకపోయిన మంజుల దర్శకురాలిగా తన క్రియేవిటీని చూపిస్తుందని ఆశిద్దాం...!

Mahesh Babu Loves His Sister's Teaser:

Manjula got even bigger delight when her celebrity brother, Super Star Mahesh himself lavished praises. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs