అక్కినేని అఖిల్ - కళ్యాణి ప్రియదర్శిని హీరో హీరోయిన్లుగా విక్రం కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హలో. ఈ సినిమా ఈ నెల 22 నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అఖిల్ హలో సినిమాకి పోటీగా నాని సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన ఎంసిఏ మూవీ కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. నాని సినిమా కూడా డిసెంబర్ 21న రావడంతో.... నాని కున్న క్రేజ్ ముందు హలోకి కష్టాలు తప్పవని అనుకున్నారు అంతా. అంతేకాదు అఖిల్ తండ్రి హలో నిర్మాత నాగార్జున కూడా ఎంసీఏ నిర్మాత దిల్ రాజుతో మంతనాలు జరిపి తమ సినిమాని ముందుకు వెనక్కు జరుపుకోమని రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు తాజాగా నాని కంటే కూడా అఖిల్ మెల్ల మెల్లగా పుంజుకుంటున్నట్లుగానే కనబడుతుంది. ఎలా అంటే... అసలు హలో సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి ఈ మూవీపై అంచనాలు లేవు. అందులోను అఖిల్ మొదటి సినిమా రిజల్ట్ అస్సలు బాగోలేక అఖిల్ హలో మీద అంచనాలు లేకుండా పోయాయి. అయితే ఇటీవల వచ్చిన హలో టీజర్ ఇంకా ట్రైలర్ ఈ మూవీపై ఒక్కసారిగా అందరి అంచనాల్ని పెంచేసింది. నిన్న మొన్నటివరకు ఎంసిఏ సినిమా కంటే తక్కువ ఆసక్తి ఉన్న హలో పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగాయి.
అసలు ప్రస్తుతం ప్రేక్షకులలో ఎంసిఎ కంటే కూడా హలో సినిమాని చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది అని సినీ వర్గాలు అంటున్నాయి. నాని సినిమా వదిన, మరిది నేపధ్యం అని చెప్పగానే.. ఓహ్ ఇది రొటీన్ స్టోరీ నే కదా అని అందరిలో ఆసక్తి తగ్గింది. అలాగే హలో సినిమా కొత్త ప్రేమకథ అవ్వడం.. విక్రం కె కుమార్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందో అనేది మరో 10 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది.