Advertisement
Google Ads BL

రాజమౌళిని మెప్పించిన చిత్రం!


నేడు టాలీవుడ్‌లో చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌ వంటి స్టార్స్‌ వేరే చిత్రాన్ని పొగిడినా, సినిమా బాగుందని ప్రశంసించినా, వారి వేడుకలకు హాజరైనా ఆ చిత్రానికి కోట్లు ఖర్చుపెడితే గానీ రాని ప్రమోషన్‌ వచ్చేస్తుంది. అలాంటి స్టార్స్‌కి ఉన్న క్రేజ్‌ని, టేస్ట్‌ని, వారితో సమానమైన ఇమేజ్‌ని తెచ్చుకున్నవాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన ఇప్పటివరకు తన చిత్రాలతో ఫ్లాప్‌ అనేదే లేని దర్శకునిగా స్టార్‌ ఇమేజ్‌ని సాధించాడు. ఆయన తీసే చిత్రాలకే కాదు..ఆయన ఏదైనా చిత్రం చూసి బాగుందని చెబితే ఆ చిత్రానికి వచ్చే మైలేజ్‌ స్టార్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోదు. ఆయన టేస్ట్‌, అభిరుచి, జడ్జిమెంట్‌పై తెలుగు ప్రేక్షకులకు అంత గురి ఉంది. అలాంటి రాజమౌళి ఈ ఏడాది విడుదలై సంచలన విజయం సాధించి, ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని చూసి దర్శకుడు సందీప్‌రెడ్డి, హీరోహీరోయిన్లు విజయ్‌దేవరకొంద, షాలిని పాండేలని ఎంతో పొగిడి ప్రశంసల వర్షం కురిపించడమే కాదు.. ఏకంగా ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో ది బెస్ట్‌ మూవీ 'అర్జున్‌రెడ్డి' అని కితాబిచ్చేశాడు. 

Advertisement
CJ Advs

దీంతో జక్కన్న పొగడ్తలు ఈ చిత్రం దర్శకహీరోహీరోయిన్లకే కాక యూనిట్‌ అంతటికి ఎంతో బూస్టప్‌ అనే చెప్పాలి. మరోవైపు దర్శకుడు సందీప్‌రెడ్డి తన రెండో చిత్రం విషయంలో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ముంబై వెళ్లి రాంగోపాల్‌వర్మని కలిసి తన రెండో చిత్రం కథను ఆయనకు చెప్పడం, దీంతో ఆ రెండో చిత్రం కథ విన్న తనకి ఎంతో ఈర్ష్య కలిగిందని, సందీప్‌రెడ్డి రెండో చిత్రం కథ వింటే.. ఈ చిత్రం సాధించబోయే విజయం ముందు 'అర్జున్‌రెడ్డి'ని ఫ్లాప్‌ మూవీగా చెప్పుకోవచ్చని వర్మ పొగడ్తల వర్షం కురిపించడంతో ఇప్పుడు సందీప్‌రెడ్డి రెండో చిత్రం అప్‌డేట్స్‌ కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Rajamouli on his Favourite Film of 2017:

Tollywood Jakkana SS Rajamouli speaking to scribes revealed his favorite film of 2017
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs