తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథలను ఎనలైజ్ చేసి మంచి సినిమాలను నిర్మించడంలో ఎంతో అవగాహన ఉన్న వ్యక్తుల్లో దిల్ రాజు ఒకరు. అసలు సబ్జెక్ట్‌ను ఎన్నుకోవడంలో గానీ, ధైర్యం చేసి కొన్ని సినిమాలను తియ్యడంలో గానీ, ఊహించని విజయాలు సాధించడంలో గానీ దిల్ రాజుకి సాటి మరెవ్వరు లేరు. ఇంత అనుభవజ్ఞుడు ఇప్పుడు ఒక తప్పటడుగు వేసాడని టాక్ వినబడుతుంది. ఒక సినిమా టైటిల్ విషయంలో దిల్ రాజు తప్పటడుగు వేసాడనిపిస్తుందని అంటున్నారు.
మాములుగా సినిమా పేరు సినిమా విజయంలో కీలక పాత్ర వహిస్తుందనేది తెలిసిన విషయమే. హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థలతో సమానంగా సినిమా పేరు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. అయితే ఈ నెల 21న దిల్ రాజు రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాకు 'MCA' అని పేరు పెట్టారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' అని ట్యాగ్ లైన్ ఉన్నా అంతా 'MCA' అనే అంటారు. ఆ పేరే ఈ సినిమాకు ఒక పెద్ద మైనస్ పాయింట్. హీరో నాని, దిల్ రాజు పేర్లు ఆ సినిమాకు ఎంత ప్లస్ అయినా పేరు మాత్రం వెనక్కి లాగుతుంది అంటున్నారు.
అయితే ఎందుకు ఇలా అంటున్నారంటే... గతంలో అంటే మొన్నీమధ్యనే రామ్ హీరోగా వచ్చిన 'ఉన్నది ఒక్కటే జిందగీ' గానీ, రాజశేఖర్ కి హిట్ ఇచ్చిన 'PSV గరుడవేగ' గానీ టైటిల్స్ వల్లే కనీసం పదిశాతం ప్రేక్షకులనైనా దూరం చేసుకున్నాయి. మరి నానీ ఒక విధంగా మాస్ హీరో. అందుకే ప్రేక్షకులు విలేజెస్ నుంచి కూడా వచ్చి నాని సినిమా చూస్తారు. అలాంటి వాళ్ల నోళ్లల్లో 'MCA' అనే పదం పలకదు కాబట్టి ఈ టైటిల్ విషయంలో మాత్రం దిల్ రాజు బ్యాచ్ కి కూడా ఇబ్బందులు తప్పవేమో అంటున్నారు. అసలు అదేదో నాని గాడి సినిమా అంట అనుకోవాల్సిందే గానీ సినిమా పేరు వాళ్లకు మైండ్ కి రిజిస్టర్ కాదు. కాకపోతే పట్టణ ప్రాంత ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుంటే ఇది క్యాచి టైటిలే…. కానీ విలేజెస్ పరంగా మాత్రం ఈ టైటిల్ దెబ్బేస్తుంది. ఆ అసలు 'MCA' తీసేసి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' అని పెట్టినా బాగుండేది అని అంటున్నారు కొందరు.