Advertisement
Google Ads BL

తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది!


ఒకప్పుడు అశ్వనీదత్‌కి చెందిన వైజయంతి మూవీస్‌కి ఎంతో ఘన చరిత్ర ఉంది. కానీ వరుస ఫ్లాప్‌లు, డిజాస్టర్స్‌తో ఆయన బాగా స్లో అయ్యాడు. ఇక ఆయన నాటి ఎన్టీఆర్‌ నుంచి నేటి ఎన్టీఆర్‌ వరకు, చిరంజీవి నుంచి చరణ్‌ వరకు అందరితో చిత్రాలు నిర్మించాడు. కానీ ఆ తర్వాత ఆయన పెద్దగా సక్సెస్‌లు రాకపోవడంతో మౌనంగా ఉన్నాడు. మరో వైపు ఆయన కుమార్తెలు మాత్రం 'త్రీ ఏంజిల్స్‌'తో పాటు స్వప్న బేనర్‌పై పలు చిన్న చిత్రాలను నిర్మిస్తూ మంచి అభిరుచి కలిగిన నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక త్వరలో మరలా అశ్వనీదత్‌ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తూ తన అల్లుడైన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో 'మహానటి' టైటిల్‌తో సావిత్రి బయోపిక్‌ని నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

మొదట్లో ఇది లో-బడ్జెట్‌ చిత్రమని భావించారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కావడం వల్ల, ఈ చిత్రాన్ని స్వప్న బేనర్‌లో నిర్మిస్తున్నారనే వార్తలు వచ్చిన నేపధ్యంలో అలాంటి అనుమానాలు వచ్చాయి. కానీ ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందుతోంది. వైజయంతీ బేనర్‌లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం గురించి స్వప్న మాట్లాడుతూ, ముందుగా ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు సమంతనే అనుకున్నాం. ఆమె ఎంపిక కూడా జరిగిపోయింది. ఆ తర్వాత కొత్తవారితో చేయిస్తే బాగుంటుందని భావించి కీర్తిసురేష్‌ని ఎంపిక చేశాం. ఆమెకు మా సినిమాలో అవకాశం ఇచ్చేటప్పుడు అంత పెద్ద పేరు లేదు.

కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాల వల్ల ఆమె ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ అయింది. ఇక సావిత్రిగారి కుమార్తె విజయచాముండేశ్వరి ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన పలు విశేషాలనే కాదు.. అరుదైన ఫొటోలను కూడా సంపాదించాం. ఈచిత్రాన్ని మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం... అని చెప్పుకొచ్చింది. ఇక ఇందులో దుల్కర్‌సల్మాన్‌, మోహన్‌బాబు, విజయ్‌దేవరకొండ, ప్రకాష్‌రాజ్‌, 'అర్జున్‌రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండే కూడా నటిస్తోంది. ఇక ఇంతకు ముందు షాలిని పాండే జమున పాత్రని పోషిస్తోందని, సమంత జర్నలిస్ట్‌గా నటిస్తోందని భావించారు. కానీ సమంత జమునగా నటిస్తుండగా, షాలిని పాండే పాత్ర ఏమిటో తెలియాల్సివుంది...! 

Keerthi Suresh Second Choice For Mahanati:

Swapna Dutt who is producing the film on Vyjayanthi Movies banner while peaking to scribes made startling revelation that Keerthi was not the first choice for Mahanati Savitri role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs