Advertisement
Google Ads BL

కమెడియన్‌ ఆత్మహత్య మలుపులు తిరుగుతోంది!


రవిబాబు 'అమ్మాయిలు-అబ్బాయ్‌'ల ద్వారా వెండితెరకు పరిచయమై, 'బొమ్మరిల్లు'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్‌ విజయ్‌ సాయి తాజాగా హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఇక ఈయన భార్య వనితారెడ్డి కూడా ఐటం పాటల ద్వారా, ఇతర బిగ్రేడ్‌ తరహా పాత్రలతో కాస్త గుర్తింపునే తెచ్చుకుంది. ఇక విజయసాయిది ఒంగోలు. గత రెండేళ్ల నుంచి భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ విడాకులకు అప్లై చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. విజయ్‌ తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఓ సెల్ఫీవీడియోను తీశాడు.

Advertisement
CJ Advs

ఇందులో తన భార్య వనిత తాను విడాకుల కేసు నుంచి బయటపడాలంటూ మూడు కోట్లు డిమాండ్‌ చేస్తోందని, ఆమె తరపు లాయర్‌ శ్రీనివాస్‌తో పాటు శశిధర్‌ అనే వ్యక్తి తనని బాగా వేధిస్తున్నారని, రెండు రోజుల కిందట తన కారుని, ఇంట్లోని సామానును వారు ఎత్తుకెళ్లారని, దాంతో తనకు అవమానం కలగడమే కాదు.. తమ పాప వనిత వద్ద పెరిగితే చెడిపోతుందని, కాబట్టి తన కూతురు ఆమె వద్ద ఉండటం తాను భరించలేకపోతున్నానని పేర్కొన్నాడు.

కానీ వనిత మాత్రం విజయ్‌సాయికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని, తనతో విడిపోయిన తర్వాత మరొకరిని వివాహం చేసుకుని ఆమెను కూడా వదిలేశాడని, అతనికి హెచ్‌ఐవి ఉందని అంటోంది. తనను ఎన్నో చిత్రహింంసలకు గురిచేశాడని, ఆయనకు తన తండ్రితో ఆస్తుల విషయంలో గొడవలున్నాయని అంటోంది. మరోవైపు విజయసాయి తండ్రి మాత్రం వనిత, ఆమె అడ్వొకేట్‌, లాయర్‌ శ్రీనివాస్‌ల వేధింపుల వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫ్‌ వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు చేయాలంటున్నాడు..!

Secrets Behind Comedian Vijay Sai Suicide :

Comedian Vijay Sai Suicide Mistory <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs