Advertisement
Google Ads BL

తెలుగు హీరోయిన్‌ ఇక తగ్గేది లేదంటోంది!


తెలుగమ్మాయి అయిన అంజలి మొదట కోలీవుడ్‌లో రాణించి తర్వాత తన మాతృభాష అయిన తెలుగులోకి వచ్చింది. ఇక అందం, అభినయంతో పాటు కాస్త సంప్రదాయ బద్దంగా కనిపించే ఈమెను మన వారు ఎక్కువగా సీనియర్‌స్టార్స్‌కే పరిమితం చేశారు. ఇక తెలుగులో ఆ మధ్య 'గీతాంజలి' చిత్రంతో వచ్చి తనే లీడ్‌ రోల్‌ చేస్తూ సక్సెస్‌ కావడమే కాదు.. నంది అవార్డుని కూడా తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తన సహనటుడు జైతో లివ్‌ ఇన్‌ రిలేషన్స్‌ షిప్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడటం, నానా విధాలుగా ప్రయత్నించి పెద్దల అనుమతిని కూడా పొందారట.

Advertisement
CJ Advs

అయితే ఈ విషయం బయటకు వస్తే తనకు వచ్చే అవకాశాలు కూడా తగ్గి, తన కెరీర్‌పై వివాహం ఎఫెక్ట్‌ చూపిస్తోందనే భయంతోనే వారిద్దరు మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఆ మధ్య దోశ కాంపిటీషన్‌లో మాత్రమే కాదు.. జై, అంజలిల బర్త్‌డే వేడుకల్లో సైతం వారి మధ్య ఉన్న అనుబంధం వెల్లడైంది. కాగా ప్రస్తుతం ఆమె మరోసారి తన ప్రియుడు జైతో కలిసి 'బెలూన్‌' అనే థ్రిల్లర్‌ మూవీలో నటిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వచ్చిన అంజలిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆమె మూడు నెలల పాటు ఎంతో కఠినమైన జిమ్‌ వర్కౌట్స్‌ చేసి ఏడెనిమిది కిలోల బరువు తగ్గిందట. దాంతో తాను 'బెలూన్‌'లో ఎంతో కొత్తగా కనిపిస్తానని చెబుతోంది. గతంలో చీరకట్టులో ఉంటూనే కాస్త గ్లామర్‌ టచ్‌ ఉన్న పాత్రలు చేస్తూ వస్తోన్న ఈమె ఇక తన లుక్స్‌, సైజులు మారడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని, తాను కొత్తగా కనిపించడం వల్ల కూడా అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశ్యంలో ఉంది.

Anjali Waiting For Big Movies:

Anjlai Slim Look Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs