Advertisement
Google Ads BL

'రంగస్థలం' గొడవ పోలీసుల వరకు వెళ్లింది!


సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌, సమంతలు నటిస్తున్న చిత్రం 'రంగస్థలం 1985'. ఈ చిత్రంలోని రామ్‌చరణ్‌ లుక్‌ని తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పక్కా గ్రామీణ యువకునిగా గడ్డం పెంచి, లుంగీ కటి ఊరమాస్‌ లుక్‌లో చరణ్‌ కనిపిస్తున్నాడు. ఈ లుక్‌ని చూసిన వారంతా ఆయన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి 'ముఠామేస్త్రి'తరహాలో రామ్‌చరణ్‌ ఉన్నాడని అంటున్నారు. ఇక ఈ ఒక్క లుక్‌నే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రిమూవీమేకర్స్‌ సంస్థ విడుదల చేసినప్పటికీ రామ్‌చరణ్‌, సమంతలతో కలిసి ఉన్న ఫొటో, మొక్కజొన్న కంకులు  కోస్తోన్నచరణ్‌ ఫిక్‌. 

Advertisement
CJ Advs

ఇక గేదెలను పట్టుకుని వస్తున్న సమంత, అంట్లుతోముతూ డీ గ్లామర్‌గా పక్కా పల్లెటూరి యువతిగా కనిపిస్తున్న సమంత లుక్స్‌కి సంబంధించిన మూడు నాలుగు ఫొటోలు అనధికారికంగా లీక్‌ అయ్యాయి. దాంతో ఈ చిత్రం ప్రమోషన్స్‌కి ఈ లీకయిన ఫొటోలు భంగం కలిగిస్తాయని యూనిట్‌తో పాటు అందరు భావిస్తున్నారు. తాము అధికారికంగా ప్రకటించని ఫొటోలు లీక్‌కావడంతో షాక్‌ తిన్న ఈ చిత్రం నిర్మాతలు ఈ విషయంపై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనఫిషియల్‌గా బయటికి వచ్చిన ఫొటోలే అయినా వాటిని అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. 

ఏది ఏమైనా ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, సమంతల లుక్‌కి విపరీతమైన స్పందన లభిస్తోంది. మరోవైపు సైబర్‌ పోలీసులు ఈ ఫోటోలను ముందుగా ఎవరు అప్‌లోడ్‌ చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 

Case Filed Againest Rangasthalam Leaked Photos:

Mytri Movie Makers Case on Rangasthalam Photos Leaks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs