Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, చరణ్ గురించి భలే న్యూస్..!


రాజమౌళి ఈమధ్య గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌ల మోజులో పడి 'మగధీర, యమదొంగ, ఈగ, బాహుబలి-ది బిగినింగ్‌, బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రాలు చేస్తున్నాడే గానీ ఆయన చిత్రాలలో అంతర్లీనంగా కుటుంబ నేపధ్యం, మంచి హ్యూమన్‌ ఎమోషన్స్‌ కూడా భారీగానే ఉంటాయి. 'స్టూడెంట్‌ నెంబర్‌1, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు' వంటి చిత్రాలలో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్‌ని కూడా ఆయన తనదైన శైలిలో చూపిస్తారు. ఇప్పుడు దానయ్య నిర్మాతగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో చేయబోయే చిత్రం కూడా అదే తరహాలోనే ఎన్టీఆర్‌, చరణ్‌లపై కుటుంబ నేపధ్యం కూడా బాగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు అన్నదమ్ములుగా, ఇద్దరు బాక్సర్లుగా కనిపిస్తారని, ఇక ఈ కథ వారి కుటుంబ నేపద్యంలో కూడా సాగుతుందని వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఇందులో కాస్త నెగటివ్‌ ఛాయలున్న పాత్రలో ఎన్టీఆర్‌, పాజిటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో రామ్‌చరణ్‌ నటించనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోల కోసం రాజమౌళి తన యూనిట్‌ని రెండుగా విభజించాడని తెలుస్తోంది. ఓ యూనిట్‌ ఎన్టీఆర్‌పై సీన్స్‌ని చిత్రీకరిస్తే, రెండో యూనిట్‌ రామ్‌చరణ్‌పై సీన్స్‌ని కూడా చిత్రీకరిస్తుందట. ఇలా టెస్ట్‌ షూట్స్‌ని తీసిన తర్వాత ఇద్దరు హీరోల క్యారెక్టర్స్‌ని ఒకే లెవల్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇద్దరు స్టార్స్‌కి సరిసమానంగా పోటాపోటీగా ఉండేలా సీన్స్‌ రాసుకోనున్నారని అంటున్నారు.

ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏదాది ద్వితీయార్ధంలో ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌, రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీనుల చిత్రాలు పూర్తయిన వెంటనే ఈ ఇద్దరు స్టార్స్‌ రాజమౌళి హ్యాండవర్‌లోకి రానున్నారు. ఇద్దరిపై కలిసే మొదటి షాట్‌ని చిత్రీకరిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. 

Good News to NTR and Charan Fans:

Rajamouli Multi Starrer Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs