Advertisement
Google Ads BL

మహేష్ బాబు లుక్ అదిరిందిగా...!


టాలీవుడ్ మహేష్ బాబు క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతని క్రేజ్ మాత్రమే కాదు అతని అందం గురించి కూడా అంతే. టాలీవుడ్ లోనే కాదు..మొత్తం ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్ లో ఒక్కడు మహేష్. మహేష్ బాబుకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ వుంది. సినిమాల విషయంలో కాదుగాని యాడ్స్ విషయంలో బడా కంపెనీలు మహేష్ తో తమ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా నియమించి.. ఆ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యడానికి మహేష్ తో యాడ్స్  రూపొందిస్తున్నారు. మహేష్ ని పెట్టి యాడ్స్ తీసి వాళ్ళ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

మరోపక్క బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా అందం, నటనలో కన్నా సూపర్ యాక్టివ్ గా వుండే వ్యక్తిగా పేరుంది. మాంచి ఎనర్జీతో చెలరేగిపోయే.... రణ్వీర్ సింగ్ కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అయితే టాలీవుడ్ హీరో మహేష్ ని పెట్టి  థమ్సప్ సంస్థ కూడా యాడ్ తీసింది. అయితే  మహేష్ తో పాటు రణ్వీర్ సింగ్ కూడా ఈ యాడ్ లో యాక్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వీరిద్దరు వున్న పిక్ వైరల్ అయింది. ఈ పిక్ లో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా వున్నాడని అతని ఫాన్స్ జోష్ మీద వున్నారు. ఇదే లుక్ తో భరత్ అనే నేను సినిమాలో మహేష్ కనపడనున్నాడని అతడి ఫాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ 31 న విడుదల కానుంది. ఏప్రిల్ నెలలో సినిమా రిలీజ్ చేసే అవకాశం వుంది.

Mahesh Babu shoots new Thumbs Up commercial:

The snap of Mahesh Babu along with Ranveer Singh is going viral on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs