Advertisement
Google Ads BL

ఈ భామ తన టాలెంట్‌నంతా చూపిస్తోంది!


నటి ఆండ్రియా పద్దతైన పాత్రలతో పాటు హాట్‌ హాట్‌ దుస్తులు, లిప్‌లాక్‌ సీన్లు ఇలా దేనిలోనైనా ఇట్టే జీవించేస్తుంది. ఇక ఈమె కూడా నటి శృతిహాసన్‌, మమతామోహన్‌దాస్‌లలాగే నటే కాకుండా మంచి సింగర్‌ కూడా. ఇప్పటికే ఆమె తెలుగులో సూపర్‌హిట్స్‌గా నిలిచిన 'బొమ్మరిల్లు, ఎవడు' వంటి చిత్రాలలో తన గొంతు వినిపించింది. ఇక ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'భరత్‌ అనే నేను'లో ఓ పాట పాడనున్నారని తెలిపిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారధ్యంలో ఈ పాటను ఆమె పాడింది. 

Advertisement
CJ Advs

కాగా ఆమె ప్రస్తుతం 2013లో వచ్చిన కమల్‌హాసన్‌ చిత్రం 'విశ్వరూపం'కి సీక్వెల్‌గా వస్తోన్న 'విశ్వరూపం2'లో కూడా ఓ పాటను పాడిన సంగతిని ఆమే తెలిపింది. సామాన్యంగా కమల్‌హాసన్‌ ఇలాంటి వారిని ప్రోత్సహించడంలో, మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో సిద్దహస్తుడు. ఇక 'విశ్వరూపం'లో నటిగా కూడా కీలకపాత్రను పోషించిన ఆండ్రియా 'విశ్వరూపం2'లో కూడా కమల్‌హాసన్‌, పూజాకుమార్‌లతో కలిసి కీలకపాత్రను పోషిస్తోంది. ఈచిత్రాన్ని జనవరి 26న రిపబ్లిక్‌డే కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ రెండు భాగాలకు స్వయంగా కమల్‌హాసనే దర్శకత్వం వహిస్తుండగా, 'విశ్వరూపం'కి బాలీవుడ్‌ త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌లు సంగీతం అందించగా 'విశ్వరూపం2'కి గిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

ఇక ఈ చిత్రం ఫస్ట్‌పార్ట్‌ని మించిన యాక్షన్‌ సీన్స్‌తో పాటు వహిదా రెహ్మాన్‌ మీద వచ్చే పలు ఎమోషనల్‌ సీన్స్‌ కూడా చిత్రానికి ప్లస్‌ పాయింట్‌ అవుతాయని భావిస్తున్నారు. ఇక ఆండ్రియా విషయానికి వస్తే ఆమె ఇటీవలే లవర్‌బోయ్‌ సిద్దార్ద్‌తో కలసి నటించిన హర్రర్‌ మూవీ 'అవల్‌' తమిళనాట మంచి కలెక్షన్లు సాధించి కమర్షియల్‌ విజయం సాధించింది. ఇదే చిత్రం తెలుగులో కూడా 'గృహం'గా విడుదలై మంచి విజయం సాధించింది. 

Andrea Sings Song in Kamal Haasan Movie:

Andrea Multi Talent Revealed Again 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs