కొన్ని నెలలు క్రితం టాలీవుడ్ లో బ్రహ్మానందం హవా మాములుగా ఉండేది కాదు. అతను పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్లుగా ఉండేది. కానీ గత కొన్ని సినిమాలు నుండి బ్రహ్మి హడావిడి తగ్గిందనేది అందరికి అర్ధం అయిపోతుంది. వేల సినిమాల్లో జనాల్ని నవ్వించి, నవ్వించి బ్రహ్మానందం అలసిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ బ్రహ్మి ని పక్కన పెట్టి వేరే కమెడియన్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు.
బ్రహ్మానందం కోసం క్యారెక్టర్లు రాయగల సత్తా కూడా రచయితల్లో తగ్గిపోయింది. దాంతో ఇఫ్పుడు సినిమాలో బ్రహ్మీ వున్నాడా? అని కాకుండా అవునా.. సినిమాలో బ్రహ్మీ వున్నాడా? అని అడిగే రేంజ్ కు దిగింది పరిస్థితి. ఇది ఇలా ఉండగా బాలకృష్ణ నటిస్తున్న 'జై సింహా' లో బ్రహ్మీ ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ చేశాడు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న 'జై సింహా' సినిమా రష్ ని చూసిన చిత్ర బృందం చాలా హ్యాపీగా వుంది. కానీ సినిమాలో బ్రహ్మీ క్యారెక్టర్ తో అంతగా కామెడీ ట్రాక్ ను పండలేదని చిత్ర బృందం నుండి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
దీంతో బ్రహ్మీ ట్రాక్ సినిమా నుండి తొలిగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బ్రహ్మనందం ఉన్న సీన్స్ ని లేపేస్తే మాత్రం బ్రహ్మి తీరని అన్యాయంతో పాటే.. అవమానము జరిగినట్లే. మరి ఈ సినిమా ఎడిటర్ ఎంత మేరకు బ్రహ్మీ ట్రాక్ వుంచుతాడో చూడాలి. 'జై సింహా'కు కే ఎస్ రవి కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలవుతుంది.