Advertisement
Google Ads BL

ప్రభాస్‌కి ఇష్టమైన డార్లింగ్ ఎవరో తెలుసా?


సామాన్య ప్రజలకే కాదు... ఇండస్ట్రీలోని ప్రముఖులకు, ప్రముఖ రాజకీయనాయకులకు కూడా పలువురు ఇష్టమైన నటీనటులు ఉంటారు. శ్రీదేవి అంటే రాంగోపాల్‌వర్మ నుంచి ఎందరికో వీరాభిమానం.ఇక మన రవితేజ వంటి వారికి అమితాబ్‌బచ్చన్‌ అంటే పిచ్చి. ఇక పలువురు సెలబ్రిటీలకు కూడా మాధురి దీక్షిత్‌తో పాటు ఎందరో ఇష్టమైన నటీనటులు ఉన్నారు. అమీర్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌లకి రజనీకాంత్‌ అంటే వీరాభిమానం. ఇక 'బాహుబలి'తో నేషనల్‌ స్టార్‌గా ఎదిగి, నేషనల్‌ లెవల్లో యూత్‌ ఐకాన్‌గా మారి, దేశవ్యాప్తంగా ఎందరో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్న ప్రభాస్‌ చాలా మంది హీరోయిన్లకు కూడా డార్లింగ్‌గా మారిపోయాడు. 

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్‌ నటించిన 'బాహుబలి' చిత్రాన్ని నార్త్‌ ఇండియాలో ప్రముఖ నాటి స్టార్‌ హీరోయిన్‌ రవీనాటాండన్‌ భర్త అనిల్‌ తదాని డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. ఇటీవలే రవీనాటాండన్‌ తన భర్త అనిల్‌ తదానితో కలిసి హైదరాబాద్‌కి వచ్చి ప్రత్యేకంగా ప్రభాస్‌ని కలిసి ఓ పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌తో ఓ సెల్ఫీ దిగిన ఈ భామ నాడు దానిని సోషల్‌మీడియాలో పెట్టి ఆనందం వ్యక్తం చేస్తూ 'బాహుబలి' స్టార్‌తో పార్టీ ఎంతో ఎంజాయ్‌ చేశాను అని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక రవీనాటాండన్‌ పలు బాలీవుడ్‌ చిత్రాలతో పాటు తెలుగులో కూడా నేటి సీనియర్‌ స్టార్స్‌తో పలు చిత్రాలలో కలిసి నటించింది. ఇక తాజాగా ప్రభాస్‌ ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, నాకు అభిమాన నటి రవీనాటాండన్‌. ఆమెని చూస్తే నాకు వావ్‌ అనిపిస్తుంది. ముఖ్యంగా 'అందాజ్‌ అప్నాఅప్నా' చిత్రంలోని 'ఎలో జీ సనం' పాటను ఎప్పుడూ చూసి వావ్‌ అనిపిస్తూ ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పడం విశేషం. సో.... మన బాహుబలి రవీనాటాండన్‌కి వీరాభిమాని అని ఇప్పుడు తెలిసిపోయింది...! 

Prabhas is Raveena Tandon Fan:

Prabhas Reveals The Name of That Special Actress Raveena Tandon  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs