Advertisement
Google Ads BL

విక్టరీ వెంకటేష్ ఫిక్స్ అయ్యాడు!


చాలా గ్యాప్ తర్వాత కొత్త సినిమాని మొదలు పెట్టిన వెంకటేష్ ఇప్పుడు హఠాత్తుగా స్పీడు పెంచాడు.  అది కూడా చిన్న సినిమా కాదు. నెలల తరబడి షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ రోజుల్లో కేవలం 60 రోజుల్లో ఓ సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించాడు వెంకీ.  వెంకటేష్ - తేజ కలయికలో తెరకెక్కుతున్న  చాలా పెద్ద సినిమా. ఈమధ్యే తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఎటువంటి హడావిడి.. హార్భాటాలు లేకుండా సింపుల్ గా రామానాయుడు స్టుడియోస్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాని జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి  సరిగ్గా 2 అంటే రెండు నెలల్లో సినిమా షూటింగ్  పూర్తి చెయ్యాలని వెంకీతోపాటే తేజ కూడా ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నాడు దర్శకుడు తేజ. నిన్న శనివారమే ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్క్రీన్ ప్లే లాక్ చేశారు. ఇకపోతే షూటింగ్స్ కి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీకి చిన్న మేకోవర్ చేసి సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అంటున్నారు. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం యూనిట్ అంతా హీరోయిన్ వేటలో ఉంది.

త్వరలోనే వెంకీ సరసన నటించబోయే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు వీరు. మరి నిజంగా వెంకటేష్ అభిమానులకు మాటిచ్చినట్లే.. వచ్చే ఏడాది ఈ లెక్కన నాలుగు సినిమాలు చేసేలా ఉన్నాడు. మరోపక్క తేజ కూడా వెంకీ సినిమాని ఆగమేఘాల మీద పూర్తి చేసి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం ఫ్రీ అవ్వాలి. అందుకే అటు వెంకీ ఇటు తేజ కూడా తమ సినిమాని రెండు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు.

Victory Venkatesh Ready for Teja Movie:

Venkatesh Latest Movie Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs