కోలీవుడ్‌లో ఒకప్పుడు రజనీకాంత్ - కమల్‌హాసన్ అభిమానుల మధ్య వైరం ఉండేది. వారు వ్యక్తిగతంగా మంచి స్నేహితులే అయినా వారి అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని గొడవలు పడేవారు. ఇక ఇప్పుడు అజిత్ - విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ రెండు జోడీల తర్వాత కోలీవుడ్‌లో ధనుష్ - శింబు అభిమానుల మధ్య అదే వాతావరణం ఉంటుంది. వీరిద్దరికి వ్యక్తిగతంగా కూడా కొందరు హీరోయిన్లతో ఎఫైర్స్ వల్ల గొడవలు వచ్చాయని అంటారు. అలాంటి వారిద్దరు తాజాగా ఒకే వేదికపైకి రావడమే కాదు. ఒకరినొకరు బాగా పొగిడేసుకుని, కౌగిలించుకుని ఆశ్యర్యపరిచారు. ఇక ఇప్పటికే హీరోగా, దర్శకునిగా, కథ, మాటలు, పాటల రచయితగా, సింగర్‌గా కూడా తన టాలెంట్ చూపించిన శింబు ఇప్పుడు ఏకంగా ఓ బయటి చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కమెడియన్ సంతానం హీరోగా ఈ చిత్రం రూపొందింది.
ఈ ఆడియో వేడుకు ధనుష్‌తో పాటు శింబు కూడా వచ్చాడు. ఇక శింబు మాట్లాడుతూ, అందరూ నాకు, ధనుష్‌కి పడదని అనుకుంటారు. కానీ మేమిద్దరం మంచిస్నేహితులం. ధనుష్ నటించిన 'కాదల్ కొండేన్' చిత్రం చూసి ధనుష్‌ని ఎంతో మెచ్చుకుని మనమిద్దరం పెద్ద స్టార్స్ అవుతామని చెప్పాను అని చెప్పుకొచ్చాడు. ఇక ధనుష్ మాట్లాడుతూ, 'శింబు బోర్న్ ఆర్టిస్ట్'. తన 21వ ఏటనే నటన, పాటలు, దర్శకత్వం విషయాలలో తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అభిమానులు తమ మధ్య నెగటివిటీని తగ్గించుకోవాలని కోరాడు. ఇక తాజాగా శింబు విషయంలో 'ఎఎఎ' సినిమా నిర్మాత మండిపడుతున్న సంగతి తెలిసిందే. మొన్నమొన్నటి దాకా నన్ను సినిమాలు తీయకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎలా తీయాలో నాకు తెలుసు అని గట్టిగా చెప్పిన శింబు కాస్త తగ్గాడు. నేను ఎవరిని మోసం చేయను. కానీ చాలా మంది నాలోని తప్పులను ఎత్తి చూపుతుంటారు. ఇంతమంది చెబుతున్నారు కాబట్టి నాలో లోపం ఉండే ఉంటుంది.
ఇక 'ఎఎఎ' చిత్రాన్ని కొన్ని కారణాల వల్ల రెండు పార్ట్స్‌గా చేయాల్సి వచ్చింది. దాని వల్ల నిర్మాతకు ఎక్కువ నష్టం కలిగింది. అయితే ఆయన వెంటనే ఆ విషయం చెప్పకుండా ఆరునెలల తర్వాత నాపై తప్పు చూపడం సరికాదు. ఇక మణిరత్నం గారి సినిమా ఎలా చేస్తాడో చూస్తామని అంటున్నారు. నన్ను నటించనివ్వకపోతే మరో పరిశ్రమకి వెళ్లి నటిస్తాను. లేదా వేరే వృత్తి చూసుకుంటాను. మరీ కాదంటే నా అభిమానులకు సేవచేసుకుంటూ బతుకుతానని మాట్లాడటం చూస్తే ఈ విషయంలో శింబు కాస్త మెత్తబడినట్లేనని చెప్పవచ్చు.