Advertisement
Google Ads BL

అసలు విషయం బయటపెట్టిన ఆర్పీ!


నాడు తేజ వరుసగా బ్లాక్‌బస్టర్స్‌ ఇవ్వడంలో తేజాతో పాటు సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌, పాటల రచయిత కులశేఖర్‌ది కూడా కీలక పాత్ర. వారు కలిసి పనిచేసిన 'చిత్రం, నువ్వు..నేను, జయం' చిత్రాలు మ్యూజిక్‌పరంగా, సాహిత్యపరంగా యూత్‌ని బాగా కట్టిపడేశాయి. కానీ తేజ ఆ తర్వాత ఫ్లాప్‌లో ఉన్నప్పుడు ఆయనకి దర్శకునిగా ఓ చాన్స్‌ వచ్చింది. దానికి కూడా ఆర్‌.పి., కులశేఖర్‌లు పనిచేశారు. నాడు ఫ్లాప్‌లో ఉన్నప్పటికీ తేజ ఎలాగోలా తన రెమ్యూనరేషన్‌ మాత్రం పట్టుబట్టి పాత రెమ్యూనరేషనే డిమాండ్‌ చేసి సాధించాడు. అదే నిర్మాత ఆర్‌.పి.పట్నాయక్‌తో పాటు కులశేఖర్‌కి నామమాత్రపు రెమ్యూనరేషన్‌ కూడా ఇవ్వలేదు. దీంతో ఆర్‌.పి, కులశేఖర్‌లు తేజకి తమ బాధ విన్నవించుకుంటే తేజ మాత్రం 'మీరున్న పరిస్థితికి అవకాశం రావడమే గొప్ప.. ఆ మాత్రం ఇస్తున్నాడు.. తీసుకోండి' అంటూ దురుసుగా మాట్లాడాడని.. నాడే ఆర్పీ, కులశేఖర్‌లు తీవ్రంగా బాధపడ్డారు. కులశేఖర్‌ అయితే ఇండస్ట్రీ వదిలేసి ఓ గుడిలో దొంగతనం చేస్తూ పట్టుబడి మతిస్థిమితం కోల్పోయాడు. ఆర్‌.పి. సంగీతమే మానేశాడు. 

Advertisement
CJ Advs

అయితే ఆర్పీ సంగీతం మానేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. దానిని తాజాగా ఆయన చెప్పుకొచ్చాడు. నేను నాగార్జున వల్లనే సంగీతం అందించడం మానేశాను అనే మాట నిజం కాదు. నాగార్జున గారు ఎంతో మంచి మనిషి. కానీ 'నేనున్నాను' చిత్రం సమయంలో ఆయన నువ్వు మాకు మరో ప్రాజెక్ట్‌ చేయాలని అడిగారు. అప్పుడు నాకు విదేశాలలో మ్యూజికల్‌ ప్రోగ్రామ్స్‌ ఉన్నాయి. దాంతో వీలుకాదని చెప్పాను. బహుశా నాగార్జున హర్ట్‌ అయ్యారేమో.. ఈ 'నేనున్నాను' చిత్రం రీరికార్డింగ్‌ రామానాయుడు స్టూడియోలో జరుగుతుండగా సినిమాకి సంబంధించిన ఓ పెద్దాయన వచ్చాడు. నీవు మా ప్రాజెక్ట్‌కి వద్దులే అంటే బాధపడే వాడిని కాదు. కానీ ఆయన నీ పేరు వల్ల మా సినిమాకి బిజినెస్‌జరగడం లేదని అన్నాడు. దాంతో ఎంతో తీవ్ర వేదన అనుభవించాను. 

నా వల్ల బిజినెస్‌ జరగకపోవడం ఏమిటి? సంగీత దర్శకుడిని చూసి కూడా బిజినెస్‌ పెరుగుతుందా? అనే ఆలోచనలో పడిపోయాను. మరి అంతకు ముందు నేను సంగీతం అందించిన చిత్రాలకు బాగానే బిజినెస్‌ అయింది కదా..! ఇలా ఆలోచించి ఇక సంగీతం జోలికి వెళ్లలేదు. ఇక నేను 'నువ్వు నేను, మనసంతా నువ్వే' వంటి హిట్స్‌ ఉన్నప్పుడు ఎలా ఉన్నానో.. ఫ్లాప్‌లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాను. హిట్‌ వచ్చిందనే భ్రమలో నేను లేను అని చెప్పుకొచ్చాడు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఆర్‌పి పట్నాయక్‌ నాగార్జున చిత్రం 'సంతోషం' చిత్రానికి సంగీతం అందిస్తే అది మ్యూజికల్‌గా పెద్ద హిట్టయింది. మరి పరిశ్రమలోని వారి రాజకీయాలు ఇలా ఉంటాయి మరి..!

RP Patnaik Clarity on his music Stop:

Reason Behind the RP Patnaik music Stop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs