త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం పై టాలీవుడ్, పవన్ ఫాన్స్ మంచి ఎక్సపెక్టషన్స్ తో వున్నారు. ఈ చిత్రంకి సంబంధించి ఏ పోస్టర్ విడుదల అయిన అది వైరల్ అవుతూ వస్తుంది. అలానే లేటెస్టుగా రిలీజ్ అయిన ఓ లుక్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్, పవన్ బుగ్గలను గిల్లుతూ దర్శనమిస్తోంది.
స్టైలిష్ లుక్‌లో పవన్.. నవ్వుతూ ప్రేమగా ఆయన బుగ్గలను గిల్లుతున్న కీర్తిసురేష్ లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ లుక్ ను సోషల్ మీడియా త్రివిక్రమ్ ఫాన్స్ విడుదల చేసారు. బయటికి వచ్చిన ఈ లుక్ తో సినిమాపై మరింత ఎక్సపెక్టషన్స్ ఎక్కువ అయ్యాయి.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వుంది. 2018 జనవరి 10న సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అనిరుద్ అందిస్తున్న సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుంది. 'అజ్ఞాతవాసి' చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ ఆడిపాడుతున్నారు.