Advertisement
Google Ads BL

మాస్... ఊర మాస్!!

మెగా అభిమానులను ఎప్పటినుండో ఊరిస్తున్న రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఫస్ట్‌లుక్ విడుద‌లైంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పల్లెటూరి కుర్రాడి లుక్‌లో ర్ రామ్ చరణ్ అదరగొడుతున్నాడు. 'రంగస్థలం' లో రామ్ చరణ్, చిట్టిబాబు అనే పాత్రలో క‌నిపిస్తాడ‌ట‌. ఈ ఊర మాస్ లుక్ లో మాస్ బాడీ లాంగ్వేజ్‌తో పక్కా పల్లెటూరి యువకుడిలా మెగా పవర్ స్టార్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌తోనే డైరెక్టర్ సుకుమార్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేశారు. ‘రంగస్థలం’ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకొంటోంది.

Advertisement
CJ Advs

ఇక 'రంగస్థలం' ఫస్ట్ లుక్ తోపాటు మార్చి 30న థియేటర్లలో చిట్టిబాబును కలుసుకోండంటూ రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీని ఇచ్చేశాడు రామ్ చరణ్. 1985లో జరిగిన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఆ పల్లెటూరి వాతావరవరణానికి తగ్గట్టుగా ఇప్పుడు రామ్ చరణ్ లుక్ కనబడుతుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మాత్రం ఊర మాస్ మాదిరిలా  కనబడతాడనేది మాత్రం ఎప్పుడో బయటికొచ్చిన లీకేజ్ ఫొటోస్ తోనే అర్ధమైంది. ఇక ఇప్పుడు చరణ్ 'రంగస్థలం' లుక్ తో క్లియర్ కట్ గా అర్ధమైంది.

ఇక ఈ సినిమాలో  చెర్రీ సరసన సమంత హీరోయిన్‌ గా నటిస్తుంది. ఆది పినిశెట్టి, అనసూయ, ప్రకాష్ రాజు, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Rangasthalam First Look out:

Hitherto, the film's title was contemplated as 'Rangasthalam 1985'. Finally, the makers go with just Rangasthalam discarding the year, 1985
Show comments

LATEST TELUGU NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs