Advertisement
Google Ads BL

అల్లు అరవింద్ నీ.. వదలని పవన్ కళ్యాణ్!


చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయన బావమరిది అల్లు అరవింద్ అన్ని తానై నడిపించారు. ప్రజారాజ్యం టిక్కెట్ల పంపిణి విషయం దగ్గరనుండి ఎక్కడ ఎలా ప్రచారం చెయ్యాలో అనే వరకు అల్లు అరవింద్ అన్ని దగ్గరుండి చూసుకున్నారన్నది తెలిసిన విషయమే. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల  ప్రచారంలో చిరు కొడుకు చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాగబాబు ఇలా మెగా ఫ్యామిలీ అంతా ప్రచారంలో పాల్గొంది. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18  సీట్లు గెలుచుకుని తదనుగుణంగా ఆ పార్టీని చిరు కాంగ్రెస్ లో విలీనం చేశాడు.

Advertisement
CJ Advs

అయితే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడాన్ని పవన్ కళ్యాణ్ అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అదే విషయాన్నీ ఇప్పుడు పవన్ మాట్లాడుతూ.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ విషయంలో మట్లాడదామంటే నన్ను కేవలం ఒక నటుడిగానే చూశారు.  ఒక రాజకీయ నాయకుడిగా అనుకొలేదు.. అందుకే అప్పుడు మాట్లాడలేనివి ఇప్పుడు మాట్లాడుతున్నానంటూ అల్లు అరవింద్ మీద పంచ్ పేల్చాడు పవన్. అదేమిటంటే.. ప్రజారాజ్యం పార్టీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ ని పాలనా చోటుకి పంపించండి అని మా అన్నగారు చిరుకి ఎవరో చెబితే దానికి అల్లు అరవింద్ గారు ఎందుకండీ మన రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారుగా అని అన్నారు.

అప్పుడు నాకేమనిపించింది అంటే... అల్లు అరవింద్ గారు నన్ను కేవలం నటుడిగానే చూశారు. ఆయన తన కొడుకు, అల్లుడుతోపాటే.. పవన్ కళ్యాణ్ కూడా ఒక నటుడు అనుకున్నాడే తప్ప... ఆయనకు నాలో ఉన్న సామాజిక స్పృహ మాత్రం  కనిపించలేదు. అటువంటప్పుడు నేను ఏం మాట్లాడితే అక్కడ ఎవరు వింటారు చెప్పండి. అందుకే  చేతులు కట్టుకుని లోపల మధనపడేవాడిని అంటూ.. అప్పట్లో జరిగిన విషయాన్నీ పవన్ ఇప్పుడిలా చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan Targets Allu Aravind:

Pawan Kalyan Counters on Allu Aravind in PRP Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs