ప్రస్తుతం ఎంతో కాలంగా ఫ్లాప్‌లో ఉన్నవారు కూడా విలన్లుగా, సపోర్టింగ్ క్యారెక్టర్లు, హీరోలుగా కూడా కమ్‌బ్యాక్ మూవీలు చేస్తున్నారు. కాస్త వారి ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. రాజశేఖర్, తేజ, ప్రవీణ్‌సత్తార్‌లు ఓకే అనిపించారు. మరి సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మళ్లీరావా' ద్వారా మరలా ఆయన గాడిలో పడతాడో లేదో ఈరోజే తేలనుంది. ఇక ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా వినిపించే అబద్దం 'టు మినిట్స్ సార్.. రెడీ అయిపోతుంది' అనేదేనని చెప్పాడు. సాధారణంగా షూటింగ్స్ జరిగే సమయంలో నెక్ట్స్ షాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే జస్ట్ 'టు మినిట్స్ సార్.. రెడీ అవుతుందని' చెబుతుంటారు. ఆ టు మినిట్స్ అరగంట కావచ్చు. గంటపైనా పట్టవచ్చు. అది అనేవారికి వినే వారికి కూడా అది నిజం కాదని తెలుసు. కానీ అదే మాటను ప్రతిచోటా చెబుతూనే ఉంటారు.
ఇక నేను జగన్‌కి క్లాస్‌మేట్‌ని. మేమిద్దరం ఇప్పుడు ఎవరి బిజీలో వాళ్లం ఉన్నాం.. జగన్ రాజకీయాలలో బిజీ అయిపోయాడు. ఆయన్ను రెండేళ్ల కిందట కలిశాను. ఇప్పుడు పెద్దగా కలుసుకోం అని చెప్పుకొచ్చాడు. ఇక తనకి 'మళ్లీరావా' ద్వారా పెద్ద కాంప్లిమెంట్ వచ్చిందని, సాధారణంగా నా సిస్టర్ బాగా లేని సినిమాని చూసినప్పుడు ఏడ్చినట్లుంది అనేస్తుంది. దాంతో 'మళ్లీరావా' టెస్ట్ షో జరుగుతున్నప్పుడు నేను మౌనంగా దూరంగా కూర్చున్నాను. సినిమా చూసిన వెంటనే ఆమె వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, ఆనందభాష్పాలు రాలుస్తూ మంచి సినిమా అన్నయ్య అని చెప్పింది. ఇది నాకు నా లైఫ్‌లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్‌గా ఫీలయ్యాను. ఇక మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు. అది మా ఫ్యామిలీ మాకు ఇచ్చిన గిఫ్ట్.
కానీ గతంలో ఖాళీగా ఉండటం ఎందుకు? అని కొన్ని స్టుపిడ్ చిత్రాలు చేశాను. కొన్ని సార్లు ఖాళీగా ఉన్నా కూడా మంచి కథలు దొరకవు. దొరికితే ఒకేసారి రెండు మూడు వస్తాయి. ఇదంతా అదృష్టం, టైమ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక నుంచి మంచి చిత్రాలే చేస్తాను. ఇక నేను ప్రొడ్యూసర్ గా మారేే అవకాశం లేదు. బయటి చిత్రాలు వస్తున్నప్పుడు సొంతగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు.. కదా...! అని లౌక్యంగా సమాధానం ఇచ్చాడు. మరి ఈ చిత్రం ఫలితం ఏమిటో చూడాల్సి వుంది..!