Advertisement
Google Ads BL

బాలయ్య 104 పై నో డౌట్..!


గత వారం రోజులుగా నందమూరి బాలకృష్ణ నిత్యం వార్తల్లోనే ఉంటున్నాడు. ఒక పక్క జై సింహ సినిమా షూటింగ్ పూర్తి. అలాగే జై సింహ ఆడియో ప్లేస్ అండ్ టైం.... అలాగే జై సింహ సినిమా 2018 సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్స్ లోకి రావడంతోపాటు... బాలయ్య బాబు 103 మూవీ గురించి. బాలకృష్ణ.. సీనియర్ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవ్వడం. ఈ సినిమా జనవరి నుండి సెట్స్ మీదకెళుతుందనే సమాచారం కూడా వుంది.

Advertisement
CJ Advs

ఇకపోతే 104 వ సినిమాని కూడా బాలకృష్ణ కన్ఫర్మ్ చేసినట్లుగా తాజా సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ 104  సినిమాని రెడీ చేస్తున్నాడట. అయితే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య - మహేష్ మల్టీస్టారర్ అని వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడు ఈ సినిమాని మహేష్ హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే మహేష్ ఒకవేళ ఈ సినిమాని పక్కన పెట్టినా కూడా బాలకృష్ణ మాత్రం బోయపాటితో సినిమాకి రెడీ అవ్వడమే కాదు.. ఏకంగా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. అది కూడా బాలకృష్ణ పుట్టిన రోజు 2018 జూన్ 10 న ఈసినిమా ప్రారంభమవబోతుందనేది లేటెస్ట్ న్యూస్ గా తెలుస్తుంది.

అంతేకాకూండా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారట. అయితే సినిమాని జూన్ లో మొదలెట్టిన రెగ్యులర్ షూటింగ్ మాత్రం సెప్టెంబర్ నుండి జరగనుందని టాక్ కూడా వినబడుతుంది. ఇకపోతే ఈ లోపు బాలకృష్ణ ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాని.. బోయపాటి రామ్ చరణ్ సినిమాని పూర్తి చేసుకుని ఇద్దరూ బాలకృష్ణ 104 మూవీ కోసం పూర్తిగా రెడీ అవుతారని తెలుస్తుంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని కూడా ప్రచారం జరుగుతుంది.

Balakrishna 104th Movie Updates:

Balakrishna Movie in Boyapati Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs