జెమిని గణేషన్, ఎమ్జీఆర్‌ల తర్వాత అంతటి రసికరాజాగా కమల్‌హాసన్‌కి పేరుంది. నేటి ధనుష్, శింబులు ఆ విషయంలో ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేరు. శ్రీవిద్య, వాణిగణపతి, సారిక, సిమ్రాన్, గౌతమీ.. ఇలా ఆయన ఎవ్వరినీ వదిలిపెట్టడు. సారికని బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడేగానీ వీరిద్దరికి పెళ్లికి ముందు శృతిహాసన్ జన్మించింది. ఇక ఇప్పుడు శృతిహాసన్ కూడా తన తండ్రి బాటలోనే పయనిస్తోంది. ఆమె ఎంతో కాలంగా లండన్‌కి చెందిన నటుడు, సింగర్, మ్యూజిషియన్ మేఖేల్‌కోర్స్‌తో సహజీవనం చేస్తూ ముంబై, లండన్‌లలోమాత్రమే గడుపుతోంది. సినిమాలకి కూడా అనధికారికంగా నో చెప్పేసిందని అర్ధమవుతోంది. ఇక తన బోయ్‌ఫ్రెండ్‌ని మొదటగా ఆమె తన తండ్రికే పరిచయం చేసింది. ఆయన అంగీకారంతో ఇటీవల తన తల్లి సారికకు కూడా ప్రియుడిని పరిచయం చేసి ఆయన గొప్పవ్యక్తిత్వం గురించి చెప్పేసింది. ఇక త్వరలో వీరి వివాహమే మిగిలి ఉంది. మిగిలిన అన్ని పనులు పెళ్లి తర్వాత కాకుండా పెళ్లికి ముందే జరిపేసుకున్నారు.
తాజాగా ఆమె తన ప్రియుడు మైఖేల్‌తో కలిసి తనతండ్రితో పాటు ఓ వివాహానికి హాజరైంది. నటీనటులయిన అధవ్, వినోదినిల వివాహవేడుకలో ఈమె ప్రియుడితో పాటు తండ్రి పక్కనే అటు ఇటు మధ్య కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ వేడుకకు శృతి మాత్రం ఓ మంచి పనిచేసిందనే చెప్పాలి. అదేమిటంటే.. ఆమె అక్కడ కూడా క్లీవేజ్ షో చేయకుండా సంప్రదాయమైన పద్దతిలో ఎర్రరంగు పట్టుచీరని కట్టుకుని నిండుగా కనిపించింది. ఇక ఆమె ప్రియుడు మైఖేల్‌కూడా తమిళ సంప్రదాయ దుస్తులైన పంచె కట్టులో కమల్‌లాగానే రెడీ అయివచ్చాడు. ఇక ఈ వేడుకకి రాధికాశరత్‌కుమార్, ప్రసన్న, మురుగదాస్ వంటి పలువురు కోలీవుడ్ సినీప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ కూడా తన కాబోయే భర్తని పరిచయం చేసిందని తెలుస్తోంది. ఇక వివాహమే తరువాయి.
ఈమధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు అడగవద్దని, తనకు అలాంటివి ఇష్టంలేదని చెప్పింది. మొత్తానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో పెద్ద మనసు, విశాల హృదయంతో వీరిని ఆశీర్వదించి, నేటితరం తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలుస్తుంటే, శృతిహాసన్, ఆమె ప్రియుడు మైఖేల్‌లు నేటి తరం యువతకి ప్రతినిధుల్లా మారారు.