నిజానికి ఎవరికైన పొగడ్తల కంటే భజన కంటే వాస్తవాలు చేదువైనా కూడా అవే మనిషికి తన తప్పుని, తన లోపాన్ని గుర్తించి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాయి. నాటి కాలంలో సింగీతం శ్రీనివాసరావు, కె.విశ్వనాథ్, టి.కృష్ణ, ఆదుర్తిసుబ్బారావు వంటి వారు కూడా సినిమాలను పొగుతుంటే అంతగా పొగడద్దు.. ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి. అవి మాకు తదుపరి చిత్రాల విషయంలో ఉపయోగపడతాయి. అదే పనిగా పొగిడితే ఏమోస్తుంది? అని అడిగి మరీ లోపాలను చెప్పించుకునేవారు. ఇక పివి నరసింహారావు, వాజ్‌పేయ్ నుంచి మన్మోహన్ సింగ్ వరకు విమర్శకులను పిలిచి మరీ మంచి తప్పును కనిపెట్టావు. ఇలాంటి తప్పులు ఉంటే మాకు చెప్పండి.. సరిదిద్దుకుంటామని విమర్శకులను ప్రోత్సహించేవారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా అలాగే ఉన్నాడు.
కానీ ఇప్పుడు చంద్రబాబు నాటి చంద్రబాబు వంటి నిక్కచ్చి మనిషి కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక మోదీ నుంచి చిన్న చిన్న సెలబ్రిటీలు కూడా అది తప్పు.. ఇది పద్దతి కాదు. అని పెద్దలు చెబుతుంటే దానిని సరిచేసుకోకుండా మేము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటున్నారు. ఇక సినిమా స్టార్ హీరోల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు వారు మౌనంగా ఉన్నా, వారి కులం వారు, అభిమానులు మాత్రం విమర్శలు చేసేవారిని బండ బూతులు తిడుతున్నారు. ఇక పవన్‌లో మంచిని స్వీకరించే గుణం ఉంది. అదే ఆయనను అదే సాధారణ ప్రజలను కూడా ఆకర్షితుడిని చేస్తోంది.
కానీ పవన్ విషయంలో బండ్లగణేష్, చిన్నికృష్ణ, నటుడు, దర్శకునిగా చెప్పుకు తిరిగే జీ.వి. సుధాకర్‌నాయుడు వంటి వారు మాత్రం తమ భజనతో అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక పవన్ ఈరోజు ఉస్మానియా యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన మురళి కుటుంబం, కృష్ణానది బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను మాత్రమే కాకుండా కేంద్రప్రభుత్వం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేష్ కుటుంబాలను పరామర్శించాడు. ఆ సందర్భంగా పవన్ తాను పడిన మనో వేధనను చెప్పడం చూస్తే మానవత్వం ఇంకా మిగిలే ఉందనే ఆశ కలుగుతోంది.
తాను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఓ విద్యార్ధి కృష్ణానదిలో ప్రభుత్వం వైఫల్యం వల్లే బోటుప్రమాదం జరిగింది. అంతమంది అమాయకుల ప్రాణాలు పోయాయి. మరి కిందటి ఎన్నికల్లో మీరు తెదేపాకి ఓటు వేయమని మద్దతు ఇచ్చారు. మరి దీనిలో మీ బాధ్యత లేదా? అని ప్రశ్నించాడని, బాగా ఆలోచిస్తే అది సముచితమే అనిపించిందని, కృష్ణానదిలో బోటు ప్రమాదం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కారణంగా ప్రాణాలు తీసుకున్న వ్యక్తుల మరణానికి నాది కూడా బాధ్యత ఉంది అని ఒప్పుకుంటున్నాను. నేను యువతకి చెప్పేది ఒక్కటే. మీరు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు శోకం మిగల్చకండి.. పోరాడి సాధించండి.. మీ వెంట నేను, జనసేన ఉంటాయని హామీ ఇచ్చాడు.
ఇక గతంలో డ్రెడ్జింగ్ ఉద్యోగులు సంస్థ ప్రైవేటీ కరణ గురించి పవన్‌ని కలిసి మద్దతు కోరారు. ఇంతకాలం పవన్ మౌనంగా ఉండటం కూడా ఆ ఉద్యోగి మరణానికి ఒక కారణమనే చెప్పాలి.