Advertisement
Google Ads BL

సినీ ఇండస్ట్రీ ఓ అద్దాల మేడ: సాయి ధరమ్ తేజ్!


ఇటీవల తెలంగాణ బిజెపి ఎంపీ చింతామణి  మాల్వియా 'పద్మావతి' సినిమా విషయంలో సినిమా పరిశ్రమలోని వారికి విలువ ఉండదని, ఇండస్ట్రీలోని మహిళలు రోజుకొకడితో తిరుగుతారని, రోజుకో భర్తను మారుస్తారని, మంచం మీద పరుపులను మార్చినట్లుగా మగాళ్లను మారుస్తారని సంచనల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. తమ్మారెడ్డి భరద్వాజ బిజెపిలో ఉన్న నటీమణులు కూడా అంతేనా? ఛ.. ఇలాంటి వారా ప్రజాప్రతినిధులుగా ఉండేది. ఇలాంటి వారితో మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేనంటూ కోపం వ్యక్తం చేశాడు. 

Advertisement
CJ Advs

దీనిపై తాజాగా హీరో సాయిధరమ్‌తేజ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాట్లాడనివ్వండి.. మా ఇండస్ట్రీ గురించి, మా జనాల గురించి ఏవేవో మాట్లాడుతున్నారు.. అంటూ లైట్‌గా స్పందించాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, చింతామణి  మాల్వియా ఏదో కాంట్రవర్శీ కోసం అలా మాట్లాడాడు. ఆయన మాటలకు విలువలేదు. అలాంటప్పుడు ఆయన మాట్లాడిన దాని గురించి మరలా మనం మాట్లాడి మరో కాంట్రవర్శీ చేసి, ఆయనను పాపులర్‌ చేయడం దేనికి? అద్దాల మేడ మీదకే ఎక్కువ రాళ్లు వచ్చి పడతాయి. కాబట్టి మనం అద్దాలను ఎంత స్ట్రాంగ్‌గా బిల్డప్‌ చేసుకుంటే అంత బాగుంటుందని మా అమ్మ చెప్పింది నేను అదే ఫాలో అవుతాను అని సమాధానం ఇచ్చాడు. 

మొత్తానికి ఏదో మాట్లాడి మరలా చింతామణి  మాల్వియాని హైలైట్‌ చేయడం కన్నా సాయిధరమ్‌తేజ్‌ లాగా సైలెంట్‌గా ఉంటే అక్కడితో సమస్య సద్దుమణుగుతుంది. వాగిన వారి నోర్లే నొప్పి పెట్టి చివరకు మౌనమై పోతారు. అందుకే అన్నింటికి మౌనమే సమాధానమైతే అసలు గొడవలు ఉండవు. అవతలి వారు ఏదో అన్నారని మనం కూడా అంటే వారికి, మనకి తేడా ఏముంటుంది? ఇక సినిమా పరిశ్రమ విషయంలో చింతామణి  మాల్వియాతో ఏకీభవించే వారు కూడా ఉన్నారు. సామాన్య ప్రజల్లో కూడా సినిమా వారి పట్ల అంతే చీప్‌ అభిప్రాయం ఉందనేది మాత్రం నిజం. కాబట్టి అలాంటివి లేకుండా ముందుగా తమ ఇంటిని బాగు చేసుకోవడం సినిమా వారికి మంచిదేమో...!

Sai Dharam Tej Reaction on BJP Leader Comments:

Sai Dharam Tej Reacted on BJP MP Chintamani Malviya Controversial Comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs