ప్రస్తుతం యువహీరోల విషయంలో థర్డ్‌గ్రేడ్‌లో నారారోహిత్, నాగశౌర్య, శ్రీవిష్ణులు బాగా ఆసక్తిని రేపుతున్నారు. వీరు తమదైన జోనర్స్‌తో ముందుకు వెళ్తున్నారు. వీరితో పాటు అల్లుశిరీష్, సందీప్‌కిషన్, సుధీర్‌బాబు, ఆది సాయికుమార్ వంటి వారు ఉన్నా కూడా శ్రీవిష్ణు మాత్రం తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ ఉన్నాడు. ఆయన కథల, పాత్రల ఎంపిక బాగానే ఉంటోంది. దీంతో ఒక్క మంచి హిట్‌పడితే ఈయన కూడా విజయ్‌దేవరకొండ సరసన నిలబడినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఆయనను మామూలుగా చూస్తే ఎంతో అమాయకుడిలా, నోరు కూడా విప్పడు. కానీ తెరపై మాత్రం తనదైన నటన చూపిస్తున్నాడు.
నారారోహిత్‌తో వచ్చిన 'అప్పట్లో ఒకడుండే వాడు' మంచి చిత్రమే అయినా బాగా కలెక్షన్లు సాాధించి సూపర్‌హిట్‌గా నిలవకపోవడం కాస్త బాధాకరమే. ఆ తర్వాత ఆయన రామ్‌తో చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' కూడా మంచి టాక్‌ని సాధించినా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఈచిత్రాలు రెండింటిలో శ్రీవిష్ణు బాగాచేశాడు. నేడు ఉన్న ట్రెండ్‌ని బట్టి చూస్తే రొటీన్‌గా వచ్చి ఫ్లాపయ్యేకంటే కాస్త వైవిధ్యం చూపి నటనతో మెప్పిస్తే సినిమా పెద్దగా ఆడకపోయినా అందులోని నటీనటులకు, దర్శకులకు మంచి అవకాశాలు లభిస్తుండటం విశేషం. ఇక తాజాగా శ్రీవిష్ణు నటించిన 'మెంటల్ మదిలో' కూడా మంచి చిత్రమే. ఈ చిత్రం చూస్తే నిర్మాత రాజ్‌కందుకూరి, దర్శకుడితో పాటు శ్రీవిష్ణు అభిరుచి కూడా అర్ధమవుతోంది.
ఇక తాను ఇలా వైవిధ్యభరితమైన పాత్రలే చేసుకుంటూ తనదైనా శైలిలో శ్రీవిష్ణు వెళ్తాడని భావిస్తే కేవలం మూడు నాలుగు చిత్రాలతోనే ఈయనకు మాస్ పిచ్చి అంటుకుందేమో అనిపిస్తోంది. తాజాగా ఆయన నారారోహిత్ నటించిన 'అసుర' దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఓ చిత్రం ఒప్పుకున్నాడు. దీనికి టైటిల్‌గా 'తిప్పరా మీసం' అని పెట్టారని తెలుస్తోంది. ఇలా టైటిల్‌తోనే ఇది కూడా మామూలు రెగ్యులర్ మాస్ చిత్రమనే అభిప్రాయం కలుగుతోంది. మరి శ్రీవిష్ణు ఏ దారిలో నడుస్తాడో చూడాల్సివుంది...!