Advertisement
Google Ads BL

అజ్ఞాతవాసి మరో సర్ప్రైజ్..!


పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వుంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల పది తరువాత అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ జరగాల్సివుంది. కానీ హైదరాబాద్ లో ఈ నెల 5నుంచి 19వరకు తెలుగు మహాసభలు జరుగుతున్నందున మరే భారీ ఫంక్షన్ కు అనుమతి ఇచ్చేది లేదని పోలీస్ వర్గాలు తెగేసి చెప్పాయి.

Advertisement
CJ Advs

అయితే ఆడియో ఫంక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉన్నందున సినిమాపై బజ్ తెచ్చే కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్ర బృందం. తాజాగా అజ్ఞాతవాసి సినిమాలో ఫస్ట్ ట్రాక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ట్రాక్ రిలీజ్ చేస్తున్నట్టు అనిరుద్ తన ట్విట్టర్ లో చెప్పాడు. కానీ ఆ ట్రాక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది కూడా చెప్పేశారు. ఈ నెల 12 న గాలి వాలుగా.... సింగిల్ ని విడుదల చెయ్యబోతుననట్లు చిత్ర బృందం ట్విట్టర్ లో ప్రకటించింది.

అంటే ఈ నెల 12 న గాలి వాలుగా... సెకండ్ సాంగ్ బయటకు వస్తుందన్నమాట. ఆ సాంగ్ తో పాటు పవన్ ఫాన్స్ కోసం ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటీ అన్నది బయటకు రాలేదు. బహుశా అదీ.. ఓ చిన్న వీడియో సాంగ్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సాంగ్ లో పవన్ ఫాన్స్  మెస్మరైజ్ అయ్యేలా పవన్ స్టెప్స్ వేశాడని వినికిడి.

Agnyaathavaasi Second Single Release Date:

Agnyaathavaasi Gaali Vaaluga Song Release Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs