Advertisement
Google Ads BL

అభిమానులకు మహేష్ డిసెంబర్ 31 ట్రీట్!


మహేష్ ఎప్పుడూ ప్రతి ఏటా కొత్త సంవత్సరానికి తన అభిమానులకు ఓ బహుమతి అందిస్తుంటాడు. కేవలం కొత్త సంవత్సరాదికే కాదు ఆయన తండ్రి కృష్ణ పుట్టిన రోజుకి కూడా మహేష్ అభిమానులకు ఏదో ఒక ట్రీట్ ఇవ్వడం అనేది కామన్ అయ్యింది. అయితే ఈసారి కూడా మహేష్ బాబు నూతన సంవత్సరాదికి అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు మహేష్. 2018 నూతన సంవత్సరాది రోజున మహేష్ బాబు తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ని రెడీ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
CJ Advs

మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ లో నటించిన మహేష్ తాజాగా..  కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను డిసెంబర్ 31 అర్థరాత్రి విడుదల చేయబోతున్నారనే టాక్ వినబడుతుంది. ఈ సినిమాకు భరత్ అనే నేను టైటిల్ తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. కాకపోతే భరత్ అనే నేను టైటిల్ బాగా జనాల్లోకి చొచ్చుకుపోయింది కాబట్టి... ఆ టైటిల్ తోనే లోగో డిజైన్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్.

ఇకపోతే భరత్ అనే నేను సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ నడుస్తోంది. ఇంతకుముందే ప్రకటించినట్టు ఏప్రిల్ 27న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం అయితే లేదు. రజనీకాంత్ 2.0 ఏప్రిల్ లో ఎప్పుడొస్తుందో క్లారిటీ లేకపోయినా.. బన్నీ సినిమా కూడా ఏప్రిల్ 27వ తేదీకి ఫిక్స్ అవ్వడంతో.. మహేష్ సినిమాను ఆ తేదీ నుంచి తప్పించే అవకాశాలున్నాయి.

December 31 Treat to Mahesh Fans:

Mahesh Babu and Koratala Siva Movie First Look Release on Dec 31
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs