దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానాలు నటించిన 'బాహుబలి' చిత్రం విడుదలై ఇంతకాలం అయినా దాని హవామాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం రెండు భాగాలు దేశ, విదేశాలలో సృష్టించిన ప్రభంజనం మాటల్లో చెప్పలేం. మరీ ముఖ్యంగా 'బాహుబలి-ది బిగినింగ్' సినిమా ముగింపులో వచ్చే కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగినంతగా 100ఏళ్ల భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఏచిత్రం కూడా ఇంతటి ఉత్సుకతను, సస్పెన్స్‌ని రేకెత్తించలేకపోయింది.
ఇక 'బాహుబలి-2' అయితే ఏకంగా 1000కోట్లను మించి కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈచిత్రానికి వచ్చిన ప్రశంసలు, పొగడ్తలు.. ఇలా ఎన్నిచెప్పినా మాటల్లో వర్ణించలేం. రికార్డులతోపాటు పలు అవార్డులు, ఇతర దేశాల ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో కూడా ఈ చిత్రం సంచలనానికి మారుపేరుగా నిలిచింది. ఇప్పటికే 2017లో గూగుల్ ప్లేలో 'సాహోరా బాహుబలి' పాట గేమ్‌టాప్‌లో నిలిచింది. ఇక ఇప్పుడు కోట్లాది మంది యూజర్లు ఉన్న ట్విట్టర్‌లో అత్యధికంగా ఉపయోగించిన ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాగ్‌గా 'బాహుబలి' మరో అరుదైన రికార్డును సాధించింది. ఆ తర్వాత స్థానాలలో సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేసిన 'బిగ్‌బాస్' సీజన్11, ఆ తర్వాత 'మెర్శల్'లు నిలిచాయి. ఈ లెక్కన తాజాగా సల్మాన్‌ఖాన్ కంటే ప్రభాస్ ఎక్కువగా క్రేజ్‌ని పొంది, ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండే రెండు 'బాహుబలి' పార్ట్స్‌తో నేషనల్ ఐకాన్‌గా నిలిచాడని అర్ధమవుతోంది. సల్మాన్‌తోపాటు ఈ విషయంలో విజయ్‌కూడా ప్రభాస్ వెనుకే నిలిచారు.
ఇక న్యూస్ అండ్ పాలిటిక్స్‌లో 'దీపావళి, జీఎస్టీ, మోదీ నిర్వహించే మన్‌కీ బాత్‌లు మూడు స్థానాలలో నిలవగా, స్పోర్ట్స్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్‌మ్యాచ్, ఐపిఎల్, ఉమెన్స్ వరల్ద్ కప్‌లు నిలవడం విశేషం.